జీవిత బీమా అనేది అనుకోని ఆపద కారణంగా భవిష్యత్తులో సంభవించే ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ఎంపిక చేసుకునే ఓ ఆర్థిక సాధనం. ఇందులో ఎన్ని కొత్త రకాలు పాలసీలు వచ్చినా.. బీమా యొక్క ప్రధాన లక్ష్యం మాత్రం ఇదే. అయితే కొందరు బీమాను భవిష్యత్తు ధీమా కోసం కాకుండా.. తమ ఆర్థిక అవసరాలు తీర్చుకునే అవకాశంగా భావిస్తుంటారు. ఇందుకోసం అడ్డదారులు తొక్కుతుంటారు. బీమా ప్రయోజనాన్ని పొందేందుకు కొందరు తప్పుడు పద్ధతులను అవలంబిస్తుంటారు. యూరోప్‌లోని హంగరీ దేశంలో ఇలాంటి ఓ మోసానికి ఓ వ్యక్తి పాల్పడి విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 2014 లో హంగేరిలోని నైర్క్సాస్జారి గ్రామంలో నివసిస్తున్న సాండోర్ రైలు ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయాడు. ప్రమాదం తర్వాత, శాండోర్ తన మొత్తం కాళ్లు, మోకాలి క్రింద నుండి తన చేతులను కోల్పోయాడు. ఆ తర్వాత వీల్ చైర్‌పైకి వచ్చాడు.
అతడు జీవనం సాగించేందుకు నకిలీ చేతులు, కాళ్లు ఇచ్చారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత సాండోర్ తన బీమా కంపెనీ నుంచి డబ్బు అడిగాడు. డబ్బులు చెల్లించే ముందు బీమా కంపెనీ విచారణ చేపట్టింది. అయితే ఈ విచారణలో అంతా ఉలిక్కిపడేలా విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్సూరెన్స్ డబ్బు కోసం సాండర్ కావాలనే కదులుతున్న రైలు ముందు సాండోర్ దూకినట్లు బీమా కంపెనీ గుర్తించింది.
సాండోర్ పేరు మీద 24 కోట్ల రూపాయల బీమా ఉంది. ఈ డబ్బును విత్‌డ్రా చేసేందుకు అతడు చేతులు, కాళ్లు కోల్పోయాడు. ఈ ఇన్సూరెన్స్‌లన్నీ సాండోర్ ద్వారా ఏడాదిలోపే చేసినవి కావడం గమనార్హం. సాండోర్ ప్రమాదం జరిగిన తర్వాతే అతని భార్య బీమా కంపెనీని డబ్బు అడిగింది. కానీ కంపెనీలు మొదట దీనిని పరిశోధించాయి.
Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్లాన్ రివర్స్.. కథ మళ్లీ మొదటికొచ్చిందా ?
Harish Rao: హరీశ్ రావుకు మరో కీలక బాధ్యతలు.. కేసీఆర్ నిర్ణయం.. త్వరలోనే ప్రకటన..
ఇందులో ఈ విషయం అతడి దృష్టికి వచ్చినా సాండోర్ మాత్రం ఖండిస్తూనే ఉన్నాడు. కొన్నాళ్లుగా కోర్టులో ఈ కేసు నడుస్తోంది. ఇటీవల నవంబర్ 9న, డిస్ట్రిక్ట్ కోర్ట్ తన తీర్పును ఇస్తూ సాండోర్ ఉద్దేశ్యపూర్వకంగానే ఇలా చేశాడని పేర్కొంది. బీమా సొమ్ము కోసం ఆ వ్యక్తి స్వయంగా ప్రమాదానికి పాల్పడ్డాడని కోర్టు పేర్కొంది. దీంతో సాండోర్‌కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు కోర్టును మోసం చేసినందుకు గాను రూ.4 లక్షల 71 వేల జరిమానా కూడా విధించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Crime news, Insurance