news18-telugu
Updated: February 12, 2020, 3:03 PM IST
Video : పల్లీల్లో విదేశీ కరెన్సీ.. ఎయిర్‌పోర్టులో నయా స్మగ్లింగ్
విదేశాల నుంచి బంగారం, వజ్రాలు, కరెన్సీ అక్రమ రవాణా ఇటీవల సర్వసాధారణమైంది. అంతర్జాతీయ విమానాశ్రాయలు స్మగ్లింగ్‌కు అడ్డాగా మారుతున్నాయి. ఎయిర్‌పోర్టులో పటిష్టమైన నిఘా పెట్టినప్పటికీ.. సెక్యూరిటీ కళ్లుగప్పి స్మగ్లింగ్ చేస్తున్నారు కేటుగాళ్లు. కొత్త కొత్త పంథాలను అనుసరిస్తూ.. వినూత్న రీతిలో ఎంచక్కా అక్రమాలకు పాల్పడుతున్నారు. ఇలాగే విదేశీ కరెన్సీ స్మగ్లింగ్ చేస్తూ ఓ వ్యక్తి ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పట్టుబడ్డాడు. ఆహార పదార్థాల్లో నోట్లు దాచి అక్రమంగా తరలిస్తుండగా CISF (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్) సిబ్బంది పట్టుకున్నారు.
బుధవారం ఉదయం సాధారణ తనిఖీల్లో భాగంగా CISF సిబ్బంది మురద్ ఆలం అనే వ్యక్తిని తనిఖీ చేశారు. బ్యాగులో ఉన్న వస్తువులను చూపించాలని అడిగారు. ఏమీ లేవు సార్.. వేరుశనగలు, బిస్కెట్లు, చాక్లెట్లు మాత్రమే ఉన్నాయిని అతడు చెప్పాడు. విమానాల్లో వేరుశనగ కాయలు తరలిండచమేంటని అనుమానపడిన సిబ్బంది.. వాటి షెల్స్ ఓపెన్ చేసి చూశారు. అందులో కొన్నింటిలో పల్లీలకు బదులు విదేశీ కరెన్సీ నోట్లు ఉండడంతో షాకయ్యారు. అలాగే బిస్కెట్లు, చాక్లెట్లను కూడా తెరచిచూశారు. అందులోనూ నోట్లు బయటపడ్డాయి. మొత్తం 45 లక్షల రూపాయల విలువైన కరెన్సీ బయటపడింది. ఆ డబ్బును స్వాధీనం చేసుకొని.. మురద్ ఆలంను కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. ఆ వీడియోను CISF అధికారులు ట్విటర్లో షేర్ చేశారు.
Published by:
Shiva Kumar Addula
First published:
February 12, 2020, 3:01 PM IST