హోమ్ /వార్తలు /క్రైమ్ /

న్యూడ్ వీడియోలు పంపు లేదంటే... కాబోయే నటికి కాస్టింగ్ డైరెక్టర్ బ్లాక్ మెయిల్...

న్యూడ్ వీడియోలు పంపు లేదంటే... కాబోయే నటికి కాస్టింగ్ డైరెక్టర్ బ్లాక్ మెయిల్...

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Mumbai Crime : ప్రతి ఒక్కరికీ ఏదో ఒక బలహీనత ఉంటుంది. దాన్ని క్యాష్ చేసుకునేందుకు యత్నించే దుర్మార్గులూ ఉంటారు. అతని స్కెచ్ అతను వేశాడు. ఫలితం ఏమైందంటే...

పేరు సిద్ధార్థ్ సరోద్. వయసు 28 ఏళ్లు. ముంబైలోని సియాన్ చునాబట్టీలో ఉంటున్నాడు. తనను తాను కాస్టింగ్ డైరెక్టర్‌గా చెప్పుకుంటూ... బాలీవుడ్‌లో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పుకుంటున్నాడు. ఫేస్‌బుక్, వాట్సాప్ ద్వారా కొత్త హీరోయిన్లతో పరిచయాలు పెంచుకోసాగాడు. ఈ నోటా, ఆ నోటా తెలిసి... కొంతమంది అమ్మాయిలు అతనితో కాంటాక్ట్ అవ్వడం మొదలుపెట్టారు. తమకు సినిమాల్లో అవకాశాలు వచ్చేలా చెయ్యమన్నారు. వాళ్లలో మానష్వి (పేరు మార్చాం) ఫేస్‌బుక్‌లో పరిచయమైంది. తనకు బాలీవుడ్ సినిమాల్లో ఛాన్సులు ఇప్పించమని చాటింగ్‌లో అడిగింది. ఆమె వాట్సాప్ నంబర్ తీసుకున్నాడు. ఏ టెన్షన్లూ పెట్టుకోవద్దనీ, తాను అవకాశాలు వచ్చేలా చేస్తానని నమ్మబలికాడు. అతని మాటలు విని... ఇక ఆఫర్లు వచ్చేసినట్లే అనుకుని తెగ ఆనందపడింది మానష్వి.


నాలుగు రోజుల తర్వాత... డైరెక్టర్లు ఫొటోలు అడుగుతున్నారని చెప్పి... మానష్వి నుంచీ కొన్ని ఫొటోలు లాంగ్, మిడిల్, క్లోజ్ షాట్లు ఉన్నవి వాట్సాప్ ద్వారా తీసుకున్నాడు సిద్ధార్థ్. ఫొటోల్లో తాను చాలా అందంగా కనిపించాలని అనుకుంటూ చాలా ఎక్కువ ఫొటోలే పంపింది మానష్వి. వాటిని మొబైల్‌లోకి డౌన్‌లోడ్ చేసుకున్న సిద్ధార్థ్... పిక్స్ ఆర్ట్ అనే మొబైల్ యాప్‌ ద్వారా వాటిని మార్ఫింగ్ చేశాడు. మంచి ఫొటోలను కాస్తా న్యూడ్ ఫొటోలుగా మార్చేశాడు.


తిరిగి ఆ న్యూడ్ ఫొటోలను మానష్వికే పంపాడు. వాటిని ఇంటర్నెట్‌లో, ఫేస్‌బుక్‌లో ఆమె ఫ్రెండ్స్‌కి పంపిస్తానని బెదిరించాడు. అలా చెయ్యకూడదంటే... మానష్వికి సంబంధించిన న్యూడ్ వీడియోలు పంపాలనీ, లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఒక్కసారి న్యూడ్ వీడియోలు పంపితే, ఇక జీవితంలో తన జోలికి రానని అన్నాడు. మానష్వి ఎంత అమాయకురాలైనా... అవి మార్ఫింగ్ ఫొటోలని గుర్తించింది. అతని ఆట కట్టించాలని డిసైడైంది. తిన్నగా వెళ్లి పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.


కట్ చేస్తే... కేటుగాణ్ని అరెస్టు చేసిన పోలీసులు దర్యాప్తులో నాలుగు తగిలించగా... కొత్త విషయాలు తెలిశాయి. ఇప్పటివరకూ సిద్ధార్థ్ 8 మంది అమ్మాయిలను ఇలాగే మోసం చేశాడట. చాలా మంది దగ్గర లక్షల రూపాయలు గుంజాడట. ఇలాంటి కొండెగాళ్లతో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు ముంబై పోలీసులు.


 


ఇవి కూడా చదవండి :


ప్రత్యేక రాష్ట్రమే లక్ష్యం... స్థానికులకే ప్రాధాన్యం... ఆమ్ ఆద్మీ పార్టీ మ్యానిఫెస్టో విడుదల...


ఏపీలో రాష్ట్రపతి పాలన రాబోతోందా... కేంద్రం నుంచీ సంకేతాలు...


పైకి హ్యాపీ... లోపల టెన్షన్... చంద్రబాబు, జగన్ ఇద్దరూ అంతే... గెలుపుపై రకరకాల లెక్కలు...


చంద్రబాబుకి సింగపూర్... జగన్‌కు స్విట్జర్లాండ్... వైసీపీ అధినేత ప్లాన్ అదిరిందిగా...

First published:

Tags: Crime, Mumbai, Police

ఉత్తమ కథలు