కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. 9 ఏళ్ల బాలికను దారుణంగా...

ఇటీవల అతడి టార్చర్ పెరగడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. అనంతరం ముగ్గురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

news18-telugu
Updated: September 12, 2019, 7:22 PM IST
కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. 9 ఏళ్ల బాలికను దారుణంగా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే మరో ఘటన ఇది. ఇద్దరు కూతుళ్లపై తండ్రి అత్యాచారానికి పాల్పడ్డ దారుణ ఉదంతం హర్యానాలో వెలుగు చూసింది. మైనర్ కూతుళ్లపై కొన్ని నెలలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. సోహ్నా ప్రాంతంలో ఈ ఘోరం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. 2003లో నేపాల్‌కి చెందిన మహిళకు హర్యానా వాసితో వివాహం జరిగింది. ఆమెకది రెండో వివాహం. అంతకు ముందే ఆ మహిళకు ఓ కూతురు (17) ఉంది. రెండో భర్త ద్వారా మరో బాలిక (9), బాలుడు కలిగారు.

కొన్నేళ్ల పాటు వారి కాపురం సజావుగానే సాగింది. ఆ తర్వాత ఆమె భర్త మద్యానికి బానిసయ్యాడు. ఏ పనీ చేయకుండా కుటుంబ సభ్యులను నిత్యం వేధించేవాడు. అంతేకాదు ఇంట్లో ఉన్న ఇద్దరు కూతుళ్లపై కన్నేసిన ఆ కిరాతకుడు..వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కొన్ని నెలలుగా ఈ ఘోరం జరుగుతోంది. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించడంతో ఇన్నాళ్లు ఎవరికీ చెప్పలేదు. ఇటీవల అతడి టార్చర్ పెరగడంతో జరిగిన విషయాన్ని తల్లికి చెప్పారు. అనంతరం ముగ్గురు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల వాంగ్మూలం తీసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశారు.

First published: September 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>