Rape: అత్తను రేప్ చేయబోయిన అల్లుడు... తిక్క కుదిర్చిన కుటుంబ సభ్యులు

Rape Case: శత్రువులు ఎక్కడో ఉండరు... మన ఇళ్లలోనే ఉంటారన్నట్లుగా తయారైంది ఆ కుటుంబంలో పరిస్థితి. అసలీ దారుణం ఎలా జరిగింది?

news18-telugu
Updated: October 20, 2020, 7:31 AM IST
Rape: అత్తను రేప్ చేయబోయిన అల్లుడు... తిక్క కుదిర్చిన కుటుంబ సభ్యులు
Rape Case: అత్తను రేప్ చేయబోయిన అల్లుడు... తిక్క కుదిర్చిన కుటుంబ సభ్యులు
  • Share this:
కేరళ... కొల్లాంలోని కరుణాగపల్లిలో జరిగిందీ ఘటన. నిందితుడు విట్టిల్ బాబు, తన భార్య, అత్తగారితో కలిసి... సునామీ కాలనీలో ఉంటున్నాడు. కరోనా కారణంగా విట్టిల్ బాబు చేస్తున్న ఉద్యోగం పోయింది. కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయి. ఐతే... అతని భార్య ఉద్యోగం మాత్రం కొనసాగుతోంది. దాంతో ఆమె రోజూ ఉద్యోగానికి వెళ్లి వస్తోంది. ఇంట్లో ఖాళీగా ఉంటూ... అడ్డమైన సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్న విట్టిల్ బాబుకి అత్తగారిపై కన్ను పడింది. భర్త లేని ఆమె... తన కూతురు, అల్లుడి దగ్గర ఉంటోంది. వాళ్లపైనే ఆధారపడటంతో... విట్టిల్ బాబు అదో అవకాశంగా భావించాడు. కొన్ని రోజులుగా అత్త ఒంటరిగా ఎప్పుడు దొరుకుతుందా అని ఇంట్లోనే గుంటనక్కలా ఎదురుచూశాడు.

తాజాగా భార్య ఉద్యోగానికి వెళ్లింది. అత్త ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమెను రేప్ చేయడానికి ఇదే సరైన సమయం అనుకున్నాడు విట్టిల్ బాబు. వంటగదిలో వంట చేస్తున్న ఆమెను... ఏం వండుతున్నారు అని అడిగాడు. వంకాయలు తెచ్చి చాలా రోజులైంది... అవి పాడయ్యేలా ఉన్నాయి బాబు... వాటినే వండుతున్నాను అన్నారామె. ఎప్పుడూ వంట గదిలోనేనా... ఇటు రండి... అంటూ ఆమెను హాల్లోకి పిలిచాడు. ఏదైనా ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాడేమోనని ఏంటి బాబు అంటూ ఆమె హాల్లోకి వచ్చింది.

అప్పటికే ఇంటి తలుపులు మూసేసిన విట్టిల్ బాబు... ఆమె చేతులు పట్టుకున్నాడు. మీరు ఒప్పుకుంటే... అంటూ... ఆమె చేతుల్ని రుద్దుతుంటే... ఆమెకు అనుమానం వచ్చింది. కాస్త కళ్లెర్రజేస్తున్నట్లుగా చూసింది. మెల్లగా ఆమె దగ్గరకు జరుగుతూ... భుజంపై చెయ్యేశాడు... అంతే... ఆమె కుడిచెయ్యి... అతని చెంపను గట్టిగా తాకింది. టపేల్ మని శబ్దం వచ్చింది. అపర కాళికలా చూసిన ఆమె... ఏంటిది అంటూ గట్టిగా అరిచింది.

అప్పటికీ వెనక్కి తగ్గని విట్టిల్ బాబు ఆమెను వశపరచుకోవడానికి యత్నించాడు. అతన్ని బలవంతంగా వెనక్కి నెట్టేసిన ఆమె... గబగబా తలుపులు తెరిచి... వీధిలోకి పరుగెత్తింది. పక్కనున్న ఓ షాపు యజమాని దగ్గర ఫోన్ తీసుకొని... కూతురికి కాల్ చేసింది. వెంటనే ఇంటికి రమ్మంది. కూతురు ఇంటికి రాగానే... జరిగింది చెప్పింది. ఇలాంటి మొగుడిని క్షమించే ప్రసక్తే లేదన్న కూతురు... తన భర్తపై పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది.

రోజురోజుకూ ఇలాంటి కేసులు ఎక్కువవుతుండటంతో... వెంటనే స్పందించిన కరునాగపల్లి ఏసీపీ బి.గోపాల్ కుమార్... సీఐ మంజులాల్ టీమ్ కి ఆదేశాలు జారీచేశారు. సీఐ మంజులాల్... ఇంట్లో ఓ మూల నక్కిన విట్టిల్ బాబును అరెస్టు చేశారు. ఇకపై ఇలా చెయ్యననీ... ఈ సారికి తనను క్షమించమని భార్యను వేడుకున్నాడు. సమస్యేలేదన్న భార్య... తీసుకెళ్లి... జైల్లో తాట తియ్యమని పోలీసులకు చెప్పింది. తప్పకుండా అంటూ పోలీసులు అతన్ని పట్టుకుపోయారు.
Published by: Krishna Kumar N
First published: October 20, 2020, 7:29 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading