Cheater: 17 ఫ్యామిలీలకు షాక్... రూ.6 కోట్ల మోసాలు... చేసింది ఒక్కడే... ఎలా?

Cheater: ఇలాంటివి విన్నప్పుడు... ఈ రోజుల్లో కూడా ఇలాంటి జాదూగాళ్లు ఉన్నారా అనిపించకమానదు. అసలు 17 ఫ్యామిలీలు ఎలా మోసపోయాయి? వివరంగా తెలుసుకుందాం.

news18-telugu
Updated: November 22, 2020, 9:14 AM IST
Cheater: 17 ఫ్యామిలీలకు షాక్... రూ.6 కోట్ల మోసాలు... చేసింది ఒక్కడే... ఎలా?
ఫ్యామిలీలకు షాక్... రూ.6 కోట్ల మోసాలు... చేసింది ఒక్కడే... (credit - ANI)
  • Share this:
అతని వయసు 42 సంవత్సరాలు. చూడ్డానికి మాత్రం 25 ఏళ్ల కుర్రాడిలా ఉంటాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాడు. అతన్ని హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. ఇతగాడు... మొత్తం 17 ఫ్యామిలీలను మోసం చేశాడు. తనను తాను ఇండియన్ ఆర్మీ మేజర్ అని చెప్పుకుంటూ... మ్యారేజ్ సంబంధాలు కుదుర్చుకునేవాడు. ఆ వంకతో డబ్బులు లాగేశారు. పేరు ముదావత్ శ్రీను నాయక్. నకిలీ పేరు కూడా ఉంది. అది శ్రీనివాస్ చౌహాన్. ప్రకాశం జిల్లాలోని మండ్లమూరు మండలంలోని... కెల్లంపల్లి గ్రామానికి చెందినవాడు. పెళ్లి పేరుతో మొత్తం 17 ఫ్యామిలీల నుంచి రూ.6.61 కోట్లు లాగేశాడు. మొత్తం 17 మంది అమ్మాయిలకు పెళ్లి చేసుకుంటానని కల్లబొల్లి మాటలు చెప్పాడు. ఇతని నుంచి మూడు డమ్మీ పిస్టల్స్, మూడు జతల ఆర్మీ ఫ్యాటిగ్, ఓ నకిలీ ఆర్మీ ఐడీ కార్డు, నకిలీ మాస్టర్స్ డిగ్రీ సర్టిఫికెట్, ఇతర డాక్యుమెంట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు... మూడు కార్లు, రూ.85,000 క్యాష్ కూడా సీజ్ చేశారు.

చదివింది 9వ తరగతి వరకే. పీజీ చేసినట్లుగా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించాడు. అమృతాదేవిని పెళ్లి చేసుకున్నాడు. ఓ కొడుకును కన్నాడు. ఆ కుర్రాడి పేరు నిఖిల్ సింగ్ చౌహాన్. ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ ఫ్యామిలీ సభ్యులు ఇప్పుడు గుంటూరు జిల్లాలో ఉంటున్నారు. 2014లో శ్రీను నాయక్... హైదరాబాద్ వచ్చి.. సైనిక్‌పురిలో సెటిల్ అయ్యాడు. తాను ఇండియన్ ఆర్మీలో మేజర్‌గా జాబ్ సంపాదించుకున్నానని తన కుటుంబ సభ్యులకు చెప్పాడు. వాళ్లు నిజమే అని నమ్మారని పోలీసులు తెలిపారు.

ఈ కేడీ... నకిలీ ఆధార్ కార్డ్ సంపాదించాడు. దానిపై శ్రీనివాస్ చౌహాన్ అని పేరుంది. దానిపై నకిలీ డేట్ ఆఫ్ బర్త్ 27-08-1986 అని ఉంది. అసలు పుట్టిన తేదీ 12-07-1979. మ్యారేజ్ బ్యూరోలు, స్నేహితుల ద్వారా... పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయిల సమాచారం సేకరించేవాడు. తన నకిలీ ఆర్మీ ఐడీ కార్డు, నకిలీ పిస్టల్స్ చూపించి... అమ్మాయిల ఫ్యామిలీలకు పరిచయం అయ్యేవాడు. పుణె లోని నేషనల్ డిఫెన్స్ అకాడెమీ నుంచి డిగ్రీ చేసినట్లుగా చెప్పుకునేవాడు. హైదరాబాద్ రేంజ్‌లో ఇండియన్ ఆర్మీలో మేజర్ అని కల్లబొల్లి కబుర్లు చెప్పేవాడు.ఇది కూడా చదవండి: Water Tree: నీటిని ఇచ్చే చెట్టు... చిన్న సైజు జలపాతమే... వీడియో చూడండి

పరిచయం తర్వాత... అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి... వారి నుంచి కట్నం పేరుతో... లక్షల కొద్దీ డబ్బు లాగేవాడు. డబ్బు చేతికి రాగానే... మళ్లీ వాళ్లకు కనిపించేవాడు కాదు. అలా వచ్చిన అడ్డగోలు డబ్బుతో... మూడు కార్లు, లగ్జరీ ఐటెమ్స్ కొన్నాడు. ఇలాంటి వెధవ్వేషాలు ఎన్నాళ్లని సాగుతాయి.... ఎవరో సమాచారం ఇచ్చారు పోలీసులకు. వెంటనే నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ ఎంటరై... కారులో వెళ్తున్న కేటుగాణ్ని పట్టుకొని... కటకటాల వెనక్కి నెట్టారు.
Published by: Krishna Kumar N
First published: November 22, 2020, 9:14 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading