MAN HELD FOR MURDER OF GIRLFRIEND DUMPING BODY IN MALAD CREEK PVN
Shocking : డబ్బులు అడిగిందని,గర్ల్ ఫ్రెండ్ ని దారుణగా చంపేశాడు
ప్రతీకాత్మక చిత్రం
Man held for murder of girlfriend : రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని మాద్ బీచ్ వద్ద పడేశాడు. మృతదేహం వెర్సోవా బీచ్ ఒడ్డుకు కొట్టుకువచ్చి గురువారం సాయంత్రం పోలీసుల కంటపడింది.
Man held for murder of girlfriend : మహారాష్ట్ర రాజధాని ముంబై(Mumbai)లో దారుణం జరిగింది. ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన చిన్ననాటి ఫ్రెండ్ ని దారుణగా చంపేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గోరేగావ్ (పశ్చిమ)లోని ప్రేమ్‌నగర్‌లో నివాసం ఉంటున్న సోనమ్ శుక్లా (19).అదే ప్రాంతానికి చెందిన షాజీబ్ అన్సారీ (23) మధ్య ఏడాది నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. ఏప్రిల్ 25వ తేదీ రాత్రి అన్సారీ తల్లిదండ్రులు మరియు అన్నయ్య షాపింగ్ కోసం బయటకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఒంటరిగా ఉన్న అన్సారీని కలిసేందుకు అతడి ఇంటికి సోనమ్ వెళ్ళింది. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా గొడవ జరిగింది. రాత్రి 10 గంటల సమయంలో అన్సారీ కేబుల్ వైర్‌ను ఆమె మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం సమీపంలోని దుకాణానికి వెళ్లి గోనె సంచిని కొనుగోలు చేశాడు. మృతదేహాన్ని సంచిలో వేసి ఆ కేబుల్ వైర్‌తో కట్టాడు. స్నేహితుడికి ఫోన్ చేసి బైక్ తీసుకుని రమ్మని చెప్పాడు.
రాత్రి 11 గంటల సమయంలో మృతదేహాన్ని తీసుకెళ్లి సమీపంలోని మాద్ బీచ్ వద్ద పడేశాడు. మృతదేహం వెర్సోవా బీచ్ లో ఒడ్డుకు కొట్టుకువచ్చి గురువారం సాయంత్రం పోలీసుల కంటపడింది. దీంతో సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి నిందితుడు అన్సారీని గుర్తించి శనివారం రాత్రి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ సిరాజ్ ఇనామ్దార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే వారి ఇద్దరి మధ్య హఠాత్తుగా జరిగిన గొడవలే హత్యకు కారణమని పోలీసులు చెబుతున్నారు. బాధితురాలిపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని పోలీసులు తెలిపారు. తనను డబ్బులు ఇవ్వాలి అని శుక్లా డిమాండ్ చేసిందని,ఇవ్వకుండే పోలీస్ కేసు పెడతానని బెదిరించిందని విచారణ సందర్భంగా అన్సారీ తెలిపాడు. దీంతో ఆగ్రహానికి గురై ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. కోపంతో ఆమెను కొట్టి, ఆపై ఇంటర్నెట్ కేబుల్ వైర్ తో గొంతుకోసి చంపినట్లు విచారణలో అన్సారీ తెలిపాడు.
కాగా, సోనమ్ నుంచి ఇటీవల రూ.5,000 అన్సారీ తీసుకున్నాడు. ఏప్రిల్ 25న ఆమె అన్సారీ ఇంటికి వెళ్లిన తర్వాత తను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేసింది. లేని పక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దీంతో అన్నారీ రెండు వేలు తిరిగి ఇచ్చాడు. అయితే మొత్తమంతా తిరిగి ఇవ్వాలని సోనమ్ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య ఘర్షణ జరిగినట్లు సమాచారం.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.