క్వారంటైన్ కేంద్రంలో మహిళకు లైంగిక వేధింపులు...

కరోనా వైరస్ సమయంలో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న మహిళ మీద కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి.

news18-telugu
Updated: May 27, 2020, 2:21 PM IST
క్వారంటైన్ కేంద్రంలో మహిళకు లైంగిక వేధింపులు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా వైరస్ సమయంలో క్వారంటైన్ కేంద్రంలో ఉన్న మహిళ మీద కూడా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో వ్యక్తి. మహారాష్ట్రలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ఉన్న నాంహోరీ గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన 23 సంవత్సరాల యువతి ఈనెల 15వ తేదీను పూణె నుంచి సొంతూరుకు వచ్చింది. కోవిడ్ 19 నిబంధనల ప్రకారం ఆమెను జిల్లా పరిషత్ పాఠశాలలోని క్వారంటైన్ కేంద్రంలో ఉంచారు. అయితే, ఇతరులకు ప్రవేశం లేని ఆ పాఠశాలలోకి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చొరబడి ఆమె మీద లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. దీనికి సంబంధించి బాధితులకు క్వారంటైన్ కేంద్రం బాధ్యతలు చూస్తున్న అధికారులు, పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుడిని అరెస్ట్ చేశారు. ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు.



First published: May 27, 2020, 2:13 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading