MAN HELD FOR MISBEHAVING WITH TRAFFIC CONSTABLE AT MIRA ROAD SU
డ్రెస్ తీసేసి రారా.. అంటూ కానిస్టేబుల్‌తో గొడవ.. ఆ తర్వాత సీన్ రివర్స్.. Viral Video
కానిస్టేబుల్‌ను దూషిస్తున్న అరుణ్ సింగ్
ఇటీవలి కాలంలో కొందరు తమ పక్కన ఉన్నవారిని చూసుకుని రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్న అధికారులపై విరుచుకుపడుతున్నారు. వారిపైనే బెదిరింపులకు దిగుతున్నారు.
ఇటీవలి కాలంలో కొందరు తమ పక్కన ఉన్నవారిని చూసుకుని రెచ్చిపోతున్నారు. ఈ క్రమంలోనే డ్యూటీలో ఉన్న అధికారులపై విరుచుకుపడుతున్నారు. వారిపైనే బెదిరింపులకు దిగుతున్నారు. యువతులు సైతం మద్యం మత్తులో ట్రాఫిక్ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజాగా ట్రాఫిక్ పోలీసుపై ఓ జంట బెదిరింపులకు పాల్పడటంతో పాటు, రెచ్చిపోయి బూతులు తిట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఈ చర్యకు పాల్పడినవారిని అరుణ్ రతన్ సింగ్, అతని భార్య మీనా సింగ్‌లుగా గుర్తించారు.
వివరాలు.. అరుణ్, మీనాలు మీరా భయాందర్ రోడ్డులోని నో పార్కింగ్ ప్రాంతంలో వారి కారును పార్క్ చేశారు. అయితే నో పార్కింగ్ ప్రాంతంలో కారు పార్క్ చేసి నిబంధనలు ఉల్లంఘించినందుకు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ దానిని వీల్ లాక్ చేశారు. అయితే తిరిగి వాహనం వద్దకు చేరుకున్న అరుణ్, మీనాలు కానిస్టేబుల్‌తో వాదనకు దిగారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన విషయాన్ని పక్కకు పెట్టి.. విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌తో వాదనకు దిగారు. అతని అసభ్య పదజాలంతో దూషించాడు. బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. యూనిఫామ్ తీసి రారా.. నీ తాట తీస్తా.. అంటూ అరుణ్ ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను బండ బూతులు తిట్టారు. అరుణ్ భార్య కూడా ట్రాఫిక్ కానిస్టేబుల్‌తో వాదనకు దిగింది. అయితే ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం సహనం కోల్పోకుండా ఓపికతో వ్యవహరించాడు.
ఇందుకు సంబంధించిన దృశ్యాలను అక్కడున్న కొందరు చిత్రీకరించారు. తర్వాత ఆ వీడియో వైరల్‌గా మారింది. ఇక, వైరల్ వీడియో ఆధారంగా పోలీసులు అరుణ్ సింగ్, మీనాలపై కేసు నమోదు చేశారు. డ్యూటీలో పోలీసు అధికారిని అవమానించడం, ప్రభుత్వ పనికి ఆటంకం కలిగించినందుకు ఇద్దరిపై అభియోగాలు మోపారు. అరుణ్‌ను పోలీసులు పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడ అరుణ్ తీసుకెళ్ళి ఏడుపు ప్రారంభించారు. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అరుణ్.. రోడ్డు మీద ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై చిందులేసిన వీడియోతో పాటుగా పోలీసు స్టేషన్లో ఏడుస్తున్న వీడియో కలిపి కొందరు నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. ఇక, అరుణ్‌ను కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్ విధించిందని పోలీసులు తెలిపారు.
Published by:Sumanth Kanukula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.