కేసీఆర్,కవితపై ఫేస్‌బుక్‌లో పిచ్చిరాతలు... ప్రైవేట్ ఉద్యోగి అరెస్ట్

kcr, ts police

తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సీఎం కేసీఆర్‌తో పాటు ఆమె కుమార్తె ఎంపీ కవితపై దుష్ప్రచారం చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యరాతలు రాశాడు. దీనిపై టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండిపడింది.

  • Share this:
    సోషల్ మాడియాను జనం ఓ రేంజ్‌లో వాడేస్తున్నారు.ఇంటి విషయాల నుంచి రాజకీయాల వరకు ప్రతీ ఒక్కటి షేర్ చేస్తున్నారు. కొందరైతే.. నాయకులపై కామెంట్లు, సెటైర్లు వేసి ఎడాపెడా వాయించేస్తున్నారు. అయితే కొందరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి లేనిపోని చిక్కుల్లో ఇరుక్కుంటున్నారు. తాజాగా తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి సీఎం కేసీఆర్‌తో పాటు ఆమె కుమార్తె ఎంపీ కవితపై దుష్ప్రచారం చేశారు. ఫేస్‌బుక్‌లో అసభ్యరాతలు రాశాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, ఎంపి కవిత ఫొటోలను మార్ఫింగ్ చేసి ఫేస్‌బుక్‌లో పెట్టడమే కాకుండా అసభ్యంగా కామెంట్లు పెట్టాడు. దీనిపై టీఆర్ఎస్ విద్యార్థి విభాగం మండిపడింది. సీఎం ప్రతిష్టకు భంగం కలిగేలా, ఆయన కుమార్తె కవిత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఫేస్‌బుక్‌లో పోస్టులు ఉన్నాయంటూ టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాసయాదవ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

    దీంతో విచారణ చేపట్టిన పోలీసులు మహబూబ్ నగర్ జిల్లా నవాబ్‌పేట్‌లో ఉంటున్న ప్రైవేటు ఉద్యోగి చిప్రా నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతడే ఇలా పిచ్చిరాతలు రాస్తున్నాడని తేల్చారు. తన రెండు ఫేస్ బుక్ ఎకౌంట్లలో కూడా నరేష్ సీఎం కేసీఆర్, కవితలను ఉద్దేశించి అసభ్య వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మంగళవారం నరేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.అంతకుముందు కూడా కేసీఆర్‌పై టిక్ టాక్ వీడియో చేసిన కరీంనగర్ యువకుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
    First published: