• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN HAVING ILLICIT AFFAIR WITH DAUGHTER IN LAW AND KILLS SON IN RAJASTHAN SU

కొడుకు తాగుబోతు.. కోడలితో మామ రాసలీలలు.. లెమన్ జ్యూస్‌లో మత్తు బిల్లలు..

కొడుకు తాగుబోతు.. కోడలితో మామ రాసలీలలు.. లెమన్ జ్యూస్‌లో మత్తు బిల్లలు..

ప్రతీకాత్మక చిత్రం

ఓ వ్యక్తి తన కొడుకు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కొడుకు తాగుబోతు కావడంతో.. ఇద్దరు కలిసి రాసలీలలు సాగించారు.

  • Share this:
    ఓ వ్యక్తి తన కొడుకు భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఇది కాస్తా ఓ హత్యకు దారితీసింది. కోడలి సాయంతో ఆ వ్యక్తి కొడుకునే దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన రాజస్తాన్‌లోని జైసల్మీర్‌లోని నాచ్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని అస్కాంద్ర గ్రామంలో చోటుచేసుకుంది. ఏప్రిల్ 25న చోటుచేసుుకన్న ఈ నేరం బుధవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మామ-కోడలు ఇద్దరిని అరెస్ట్ చేశారు. బాధితుడిని హీరా లాల్‌గా గుర్తించారు. నిందితులు హీరాలాల్ తండ్రి ముకేష్ కుమార్, భార్య పార్లేగా గుర్తించారు. వీరిద్దరు అతనికి ఇచ్చిన లెమన్ జ్యూస్‌లో మత్తు బిల్లలు వేసి ఇచ్చారు. దీంతో అతడు నిద్రలోని జారుకున్నాడు. అనంతరం కరెంట్ షాక్ ఇచ్చి అతన్ని హత్య చేశారు. ఇక, ఆ మరుసటి రోజు ఉదయం హడావుడిగా బాధితుడు హీరాలాల్ మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.

    అయితే బాధితుడి ఓ కజిన్.. అతని మృతదేహానికి అంత్యక్రియలు జరగకముందు కొన్ని ఫొటోలు తీశాడు. వాటిని బాధితుడి అన్న భూమ్‌రాజ్‌కు చూపించాడు. వాటిని చూసిన భూమ్‌రాజ్‌క ఏదో అనుమానం కలిగగింది. మృతదేహంపై కాలిన గుర్తులను గమనించాడు. దీంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో మే 6వ తేదీన పోలీసులు భూమ్ రాజ్ ఫిర్యాదు మేరకు 302, 201, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పరీక్షల నిమిత్తం హీరాలాల్ మృతదేహాన్ని వెలికితీశారు.

    Hyderabad: మీ కూతురి వీడియోలు నా దగ్గరున్నాయి.. ఏం చేసుకుంటారో చేసుకోండి..

    ఛీ..వీళ్లు మనుషులా..పశువులా..కారు కోసం మూడు నెలల కన్నబిడ్డనే అమ్మేసిన కర్కశ తల్లిదండ్రులు

    ఇక, కేసు విచారణలో భాగంగా పోలీసులు హీరాలాల్ భార్య పార్లేను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆమె తన నేరాన్ని అంగీకరించింది. హీరాలాల్ నిరుద్యోగి అని, ఎప్పుడు మద్యం తాగేవాడని, తనతో గొడవ పడుతూ ఉండేవాడని చెప్పింది. ఈ క్రమంలోనే తన మామతో వివాహేతర సబంధం పెట్టకుందని పోలీసుల విచారణ వెల్లడించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.
    Published by:Sumanth Kanukula
    First published: