భార్య కళ్లముందే మరో యువతితో భర్త శృంగారం...తట్టుకోలేక...

విషయం తెలిసి మీనన్‌ను మందలించింది భార్య. దీంతో మరింత రెచ్చిపోయిన మీనన్ యువతిని తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చి భార్య ముందే ఆమెతో శృంగారం చేసేవాడు.

news18-telugu
Updated: March 29, 2020, 11:28 PM IST
భార్య కళ్లముందే మరో యువతితో భర్త శృంగారం...తట్టుకోలేక...
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
గర్ల్ ఫ్రెండ్ మోజులో పడి కట్టుకున్న భార్యనే కడతేర్చాలని అనుకున్నాడో ప్రబుద్ధుడు. వివరాల్లోకి వెళితే కొచ్చిన్ కు చెందిన మీనన్. సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న పూజితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులు ఇద్దరూ అన్యోన్యంగానే కాపురం చేసారు. పైళ్లైన మూడు నెలల కి ఉద్యోగం మానేసిన మీనన్, భార్య సంపాదన మీద ఆధారపడి బ్రతికేవాడు. ఈ క్రమంలోనే స్నేహితులతో తిరగడం, జల్సాలు చేయడం అలవరచుకున్నాడు. ఓ యువతితో పరిచయాన్ని పెంచుకున్నాడు. విషయం తెలిసి మీనన్‌ను మందలించింది భార్య. దీంతో మరింత రెచ్చిపోయిన మీనన్ యువతిని తీసుకుని ఏకంగా ఇంటికే వచ్చి భార్య ముందే ఆమెతో శృంగారం చేసేవాడు. అదేమని ప్రశ్నించిన భార్యను వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భరించలేని ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేసింది. వారి జోక్యంతో కాస్త మారినట్టు నటించాడు.

ఇటీవల భార్యాభర్తలు బెంగళూరు మకాం మార్చారు. ఇక్కడికి వచ్చినా మళ్లీ మొదటికే వచ్చాడు మీనన్. మరో అమ్మాయిని వివాహం చేసుకోవడానికి పథకం రచించాడు. ఈ నేపథ్యంలోనే భార్యను హత్య చేయాలని ప్రయత్నించాడు. దీన్ని గుర్తించిన అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
First published: March 29, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading