• HOME
  • »
  • NEWS
  • »
  • CRIME
  • »
  • MAN HAVING EXTRA MARITAL AFFAIR WITH SCHOOL TEACHER CAUGHT BY WIFE MK

సైన్స్ టీచర్, లెక్కల మాస్టారు కలిసి శృంగార పాఠాల ప్రాక్టికల్స్ చేస్తుంటే సడెన్ గా...కిటికిలోంచి....

సైన్స్ టీచర్, లెక్కల మాస్టారు కలిసి శృంగార పాఠాల ప్రాక్టికల్స్ చేస్తుంటే సడెన్ గా...కిటికిలోంచి....

ప్రతీకాత్మకచిత్రం

లెక్కల మాస్టారు స్కూలు పిల్లలు అంతా ఇంటికి వెళ్లగానే, పని ఉందని సాకుగా చూపుతూ, సైన్స్ ల్యాబులో దూరేవాడు. అక్కడే సైన్స్ టీచర్ దామినితో కలిసి శృంగార ప్రాక్టికల్స్ చేసేవాడు.

  • Share this:
    వివాహేతర బంధాలు కాపురాలను కూల్చేస్తున్నాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఈ వివాహేతర బంధాలు అడ్డంకిగా మారుతున్నాయి. కేవలం క్షణిక సుఖం కోసం ప్రారంభమయ్యే ఈ బంధాలు చివరకు ఎటు పోతున్నాయో తెలియని స్థాయికి దిగజారుతున్నాయి. ఒక్కోసారి ప్రాణాలను సైతం తీస్తున్నాయి. పిల్లలు వారి భవిష్యత్తు కూడా వీళ్లకు తమ బంధంలో కనిపించదు. అయితే తాజాగా ఓ సైన్స్ టీచర్ స్పెషల్ క్లాస్ అని ఇంట్లో భర్తకు చెప్పి, స్కూల్లో లెక్కల మాస్టారుతో కలిసి రాసలీలల్లో మునిగితేలింది. అయితే ఈ సంగతి తెలిసిన లెక్కల మాస్టారు భార్య వారిని నిలదీయగా, ఆవేశంతో ఆమె జీవితాన్ని అంతం చేశాడు. ఈ ఘటన బీహార్ లోని బేగూసరాయ్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే రామ్ లాల్ తన భార్య సుమతితో కలిసి జీవిస్తున్నాడు. కాగా రామ్ లాల్ గత మూడేళ్లుగా ఓ స్కూల్లో లెక్కల మాస్టారుగా పనిచేస్తున్నాడు. అయితే రామ్ లాల్ తో పాటు అదే స్కూల్లో సైన్స్ పాఠాలు చెప్పే దామినితో కాస్త చనువుగా ఉండేవాడు. ఇద్దరూ కలిసి స్కూల్ ముగిసే సమయానికి బైక్ పై ఇంటికి వెళ్లేవారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహతేర బంధంగా మారింది. అయితే కరోనా కారణంగా స్కూలు మూతపడటంతో వీరిద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. మధ్య మధ్యలో కలిసి నప్పటికీ, రాసలీలలు చేసుకునేందుకు వీలు చిక్కేది కాదు. అయితే బీహార్ వ్యాప్తంగా ఇటీవల స్కూళ్లు తెరుచుకున్నాయి.

    ఇదే అదనుగా భావించిన ప్రేమపక్షులు స్కూలు ముగిసిన తర్వాత కూడా ఓ గంట సేపు అక్కడే ఉండి. తమ రాసలీలలు తీర్చుకునేవారు. లెక్కల మాస్టారు స్కూలు పిల్లలు అంతా ఇంటికి వెళ్లగానే, పని ఉందని సాకుగా చూపుతూ, సైన్స్ ల్యాబులో దూరేవాడు. అక్కడే సైన్స్ టీచర్ దామినితో కలిసి శృంగార ప్రాక్టికల్స్ చేసేవాడు. అయితే ఈ విషయం ఆ నోటా, ఈ నోటా చేరి చివరకు రామ్ లాల్ భార్య సుమతికి తెలిసింది. ఆమె తన భర్తను నిలదీయగా, నీకు అనవసరం అంటూ చితకబాదాడు. ఓ రోజు సుమతి ఊరికి వెళ్లినట్లు నాటకమాడగా, సైన్స్ టీచర్ ను వెంటనే ఇంటికి వచ్చేయమని రామ్ లాల్ ఫోన్ చేశాడు. వెంటనే ఆమె తన ఇంట్లో స్పెషల్ క్లాస్ అని చెప్పి రామ్ లాల్ ఇంటికి వచ్చి అతడి ఒడిలో వాలిపోయింది. అయితే కాసేపటికి సుమతి వచ్చి వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పెద్ద గొడవ అవుతుందని భావించిన రామ్ లాల్ తన భార్య సుమతి నోరు మూసి, గొంతు పిసికాడు, ఊపిరి ఆడక పెనుగులాడిన సుమతి చివరకు ప్రాణాలు విడిచింది. వెంటనే ఆమె మృతదేహానికి చీరతో ఫ్యానుకు ఉరి వేశాడు. దీంతో ఆమె మరణించిందని అందరితో చెప్పాడు. అయితే పోలీసులు రంగ ప్రవేశంతో అసలు నిజం బయటపడింది. సుమతి మృతదేహాన్ని పోస్ట్ మార్టం చేయగా, ఆమెశరీరంపై గాయాలు కనిపించాయి. రామ్ లాల్ ను అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు నిజం బయటపడింది. నిందితులు రామ్ లాల్ తో పాటు దామినిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. కేసు విచారణలో ఉంది.
    Published by:Krishna Adithya
    First published:

    అగ్ర కథనాలు