భార్యను గర్భవతి చేయమని పక్కింటి అబ్బాయితో డీల్...చివరకు ఏం జరిగిందంటే...?

తన భార్యను గర్భవతిని చేసేందుకు ఆ వ్యక్తికి ఇప్పటికే 2,500 డాలర్లు చెల్లించానని కోర్టుకు విన్నవించాడు. ఇదిలా ఉంటూ తనకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పడంతో, ఎలాగైనా తన భార్యను తల్లి చేసేందుకు పక్కింట్లో ఉంటున్న జోస్ యువకుడికి ఆ పని అప్పచెప్పినట్లు బాధిత వ్యక్తి కోర్టుకు తెలిపాడు.

news18-telugu
Updated: September 20, 2019, 10:40 PM IST
భార్యను గర్భవతి చేయమని పక్కింటి అబ్బాయితో డీల్...చివరకు ఏం జరిగిందంటే...?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తన భార్యకు గర్భం రాలేదని పక్కింటి వ్యక్తిపై కేసుపెట్టిన ఘటన జర్మనీలో చోటు చేసుకుంది. జర్మనీలోని ఓ కోర్టులో జరిగిన వాదనల్లో డానీ అనే వ్యక్తి తన భార్యను గర్భవతిని చేయడంలో పక్కింట్లో ఉంటున్న వ్యక్తి విఫలమయ్యాడని, సదరు యువకుడిని కోర్టుకు ఈడ్చాడు. అంతేకాదు తన భార్యను గర్భవతిని చేసేందుకు ఆ వ్యక్తికి ఇప్పటికే 2,500 డాలర్లు చెల్లించానని కోర్టుకు విన్నవించాడు. ఇదిలా ఉంటూ తనకు పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పడంతో, ఎలాగైనా తన భార్యను తల్లి చేసేందుకు పక్కింట్లో ఉంటున్న జోస్ యువకుడికి ఆ పని అప్పచెప్పినట్లు బాధిత వ్యక్తి కోర్టుకు తెలిపాడు. కాగా కాంట్రాక్టులో భాగంగా ఆరు నెలల్లో తన భార్యను గర్భవతిని చేయాలని డానీ షరతు విధించాడు. అందుకు జోస్ ఒప్పుకున్నాడు. అయితే జోస్ ఆరునెలల్లో 72 సార్లు ప్రయత్నించినా డానీ భార్య గర్భవతి కాలేదు. దీంతో జోస్‌ను సైతం పరీక్షించిన డాక్టర్లు అతనికి సైతం సంతానయోగం లేదని చెప్పేశారు. దాంతో డానీ కోర్టును ఆశ్రయించాడు. అయితే జోస్ మాత్రం డబ్బు మాత్రం తిరిగి ఇచ్చేదిలేదని తెగేసి చెప్పాడు. తన ప్రయత్నం తాను చేశానని.. పైవాడి దయ లేదని కోర్టుకు వివరించాడు. దీంతో ఎలాంటి తీర్పు ఇస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
First published: September 20, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading