AC Sleeper Bus: చివరికి బస్సుల్లో కూడా.. స్లీపర్ కోచ్ బస్సులో రాత్రి 11 గంటలకు బాలికపై అమానుషం

ప్రతీకాత్మక చిత్రం

ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి ఔరియాకు స్లీపర్ కోచ్ బస్సులో వెళుతున్న బాలికపై బస్సు సిబ్బందే అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహిళల భద్రతనే ప్రశ్నార్థకంగా మార్చింది.

 • Share this:
  ఫిరోజాబాద్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం జరిగింది. దేశ రాజధాని నగరం ఢిల్లీ నుంచి ఔరియాకు స్లీపర్ కోచ్ బస్సులో వెళుతున్న బాలికపై బస్సు సిబ్బందే అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన మహిళల భద్రతనే ప్రశ్నార్థకంగా మార్చింది. బస్సుల్లో రాత్రి సమయాల్లో మహిళలు ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఢిల్లీలో 30 ఏళ్ల మహిళ తన 14 ఏళ్ల కూతురుని, 18 ఏళ్ల వయసున్న మేనకోడలిని వెంటబెట్టుకుని కాన్పూర్‌కు వెళ్లే ఏసీ స్లీపర్ బస్సు సోమవారం రాత్రి ఎక్కింది. యమునా ఎక్స్‌ప్రెస్ హైవేపై బస్సు వెళుతోంది.

  డ్రైవర్‌కు వెనుక పక్క ఉండే స్లీపర్ బెర్త్‌లో బాధిత బాలిక పడుకుని ఉంది. బాలిక తల్లి ఆ వెనుక సీటులో నిద్రిస్తోంది. మరో యువతి కూడా నిద్రపోతూ ఉంది. బస్సులో అందరూ నిద్రపోతున్నారు. ఈ సమయంలోనే బస్సు సిబ్బందిగా ఉన్న బబ్లూ, అన్షు అనే ఇద్దరు.. బాధిత బాలిక పడుకుని ఉన్న క్యాబిన్ దగ్గరకు వెళ్లి ఆమెను మద్యం తాగమని బలవంతం చేశారు. ఆ బాలిక మద్యం గ్లాస్‌ను బస్సు విండోలో నుంచి బయటకు విసిరేసింది. దీంతో.. ఆమెపై ఆగ్రహించిన బబ్లూ ఆమె చేయి పట్టుకుని బలవంతం చేయబోయాడు. ఈ పెనుగులాటలో ఆమె చేతి గాజులు పగిలిపోయాయి. ఆమె నోరు నొక్కి ఖాళీగా ఉన్న మరో క్యాబిన్‌కు తీసుకెళ్లి బబ్లూ, అన్షు అత్యాచారానికి పాల్పడ్డారు.

  బాధిత బాలిక తల్లికి కొంతసేపటికి మెలకువ వచ్చి కూతురి కోసం ఆమె క్యాబిన్ వైపు చూడగా అందులో కనిపించలేదు. దీంతో.. ఆమె కంగారు పడుతుండగా తన కూతురు మరో క్యాబిన్ నుంచి ఏడుస్తూ తల్లి దగ్గరకు వచ్చింది. తనపై జరిగిన దుశ్చర్య గురించి తల్లికి ఆ బాలిక ఏడుస్తూ చెప్పింది. బస్సును ఆపాలని.. వాళ్లిద్దరినీ పోలీసులకు అప్పగించాలని బాధితురాలి తల్లి ఎంత చెప్పినా డ్రైవర్ బస్సు ఆపలేదు. ఆమెతో పాటు తోటి ప్రయాణికులు కూడా బస్సు ఆపాలని కేకలేయడంతో ఆపాడు. బస్సు ఆపగానే నిందితులు బబ్లూ, అన్షు బస్సులో నుంచి దిగి పారిపోయారు. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు అన్షును పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. నిందితులపై పోక్సో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

  ఇది కూడా చదవండి: Husband: ఇతనో సెక్యూరిటీ గార్డు.. 11 రోజుల క్రితమే కొడుకు పుట్టాడు.. కానీ ఇలా చేశాడంటే బాధేస్తోంది..

  ఈ అమానుషం ఏ బస్సులో అయితే జరిగిందో ఆ బస్సును పోలీస్ స్టేషన్‌కు తరలించి ఫోరెన్సిక్ టీం క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. డాగ్ స్క్వాడ్ కూడా రంగంలోకి దిగింది. బస్సులో అర్ధరాత్రి జరిగిన ఈ అత్యాచార ఘటన మహిళల భద్రతపై మరోమారు సందేహాలను లేవనెత్తింది. ఇలాంటి కామాంధులను కఠినంగా శిక్షించాలని, మరో ఆడపిల్లకు ఇలాంటి అన్యాయం జరగకుండా చూడాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేసింది. పోలీసులు తప్పించుకుని తిరుగుతున్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈ అమానుషంలో బస్సు డ్రైవర్ పాత్రపై ఆరా తీస్తున్నారు.
  Published by:Sambasiva Reddy
  First published: