కట్నం ఇవ్వడం లేదని భార్యను స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించి...దారుణం...

భార్యను కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి బంధించాడు. అక్కడే తన ముగ్గురు స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించాడు. సుమారు వారం రోజులు ఆమెకు నరకం చుపించాడు.

news18-telugu
Updated: August 2, 2020, 10:22 PM IST
కట్నం ఇవ్వడం లేదని భార్యను స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించి...దారుణం...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కట్టుకున్న భార్య అనే కనికరం లేకుండా స్నేహితులతో కలిసి గర్భవతి అయిన మహిళపై దారుణంగా రేప్ చేయించిన ఘటన కలకలం రేపుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లో ఒక వ్యక్తి తన భార్యను కిడ్నాప్ చేసి తన స్నేహితులతో రేప్ చేయించాడు. ఫిలిబిత్ లో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆంబులెన్స్ సేవలు అందిస్తున్న ఒక మణిదీప్ ( పేరు మార్చాం)కు సవిత( పేరు మార్చాం)తో 2016లో వివాహం అయింది. అయితే పెళ్లి అయిన మొదటి రోజు నుంచే అదనపు కట్నం కావాలంటూ గొడవ చేయడం మొదలు పెట్టాడు. అంతేకాదు వరకట్నం తీసుకురావాలని ఆమెను చిత్రహింసలకు గురి చేశారు. ఈ క్రమంలో ఆమెను ఇష్టం వచ్చినట్లు కొట్టేవాడు.

ఈ క్రమంలోనే ఆమె గర్భవతి అని తేలింది. అయితే భార్య గర్భవతి అని తెలిసి కూడా కనికరం లేకుండా ఇష్టాను సారం కొట్టడంతో గర్భస్రావం అయింది. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చిపంపించారు. ఆతర్వాత ఆమెను కిడ్నాప్ చేసి రహస్య ప్రదేశానికి తీసుకువెళ్లి బంధించాడు. అక్కడే తన ముగ్గురు స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేయించాడు. సుమారు వారం రోజులు ఆమెకు నరకం చుపించాడు. ఆ తర్వాత ఆమెను రైల్వే ట్రాక్ దగ్గర పడేశాడు. అయితే అక్కడ కొందరు స్థానికులు ఆ మహిళగను కాపాడి. ఆసుపత్రికి తరలించారు. చివరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు..
Published by: Krishna Adithya
First published: August 2, 2020, 10:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading