తొలిరాత్రే నవవధువుకు షాక్...భార్య నగ్న వీడియోలు తీసి...బ్లాక్ మెయిల్...షాకింగ్..

కట్టుకున్న భర్త శాడిష్ట్ అని సంసారానికి పనికిరాడనే విషయం తొలిరాత్రే నవవధువుకు తెలియడంతో ఆమె షాక్ కు గురైంది. అంతేకాదు తొలి రాత్రి ఆమెను నగ్నంగా మార్చి వీడియోలు తీశాడు.

news18-telugu
Updated: July 1, 2020, 10:35 PM IST
తొలిరాత్రే నవవధువుకు షాక్...భార్య నగ్న వీడియోలు తీసి...బ్లాక్ మెయిల్...షాకింగ్..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టిన నవ వధువుకు తొలిరాత్రే చుక్క‌లు కనిపించాయి. కట్టుకున్న భర్త శాడిష్ట్ అని సంసారానికి పనికిరాడనే విషయం తొలిరాత్రే నవవధువుకు తెలియడంతో ఆమె షాక్ కు గురైంది. అంతేకాదు తొలి రాత్రి ఆమెను నగ్నంగా మార్చి వీడియోలు తీశాడు. ఇక తన లోపాన్ని బయటకు చెబితే, నగ్న వీడియోలు సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తానని బెదిరింపులకు పాల్ప‌డ్డాడు. అంతేకాదు చిత్ర హింసలు పెడుతుంటే చేసేది లేక చివ‌ర‌కు ఆమె పోలీసులను ఆశ్రయించింది.

వివరాల్లోకి వెళితే అస్సాంకు చెందిన బిశ్వాస్ కు గత సంవత్సరం డిసెంబర్ లో వివాహమైంది. ఆ సమయంలో వధువు తల్లిదండ్రులు భారీ కట్నం ముట్టజెప్పారు. అయితే బిశ్వాస్ సంసారానికి పనికిరాడన్న సంగతి మొదటి రాత్రే బయటపడింది. ఆ పై విషయం తెలుసుకున్న యువతి, బయటకు చెప్పుకోలేక లో లోపలే మధనపడింది. ఈ విషయాన్ని బయట చెబితే నగ్న వీడియోలు బయటపెడడానని బెదిరించినట్లు చెప్పారు. అయితే గతవారం యువతిని హత్య చేయాలని బిశ్వాస్ ప్రయత్నించగా, ఆమె అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
First published: July 1, 2020, 10:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading