గుంటూరులో కీచక బావ.. మరదలిని రేప్‌చేసి ఫేస్‌బుక్‌లో నగ్న ఫొటోలు

ఇంట్లో పనుల చేయాలనే సాకుతో తన భార్య చెల్లిని నిత్యం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఎవరికైనా చెబితే మీ అక్క జీవితాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించేవాడు.

news18-telugu
Updated: February 21, 2020, 3:08 PM IST
గుంటూరులో కీచక బావ.. మరదలిని రేప్‌చేసి ఫేస్‌బుక్‌లో నగ్న ఫొటోలు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
సొంత మరదలిని లైంగికంగా వేధిస్తూ నరకం చూపించాడో బావ. భార్య చెల్లెలిపైనే కన్నేసి..బలవంతంగా లొంగదీసుకొని తాళికట్టాడు. పదేళ్లుగా టార్చర్ పెడుతూ..ఇటీవల ఆమె నగ్న ఫొటోలు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అతడి వేధింపులను భరించలేని ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గుంటూరు జిల్లాలో ఈ దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొల్లూరుకు చెందిన రవికిరణ్‌కు అదే గ్రామానికి చెందిన ఓ మహిళతో 2010లో వివాహం జరిగింది. ఆ మహిళకు ఓ చెల్లి కూడా ఉంది. వారి పెళ్లి నాటికి ఆమె చెల్లి వయసు 15 ఏళ్లు. పెళ్లైన కొన్నాళ్లకు సదరు మహిళ అనారోగ్యానికి గురవడంతో ఆమె సోదరిపై కన్నేశాడు రవికిరణ్.

ఇంట్లో పనుల చేయాలనే సాకుతో తన భార్య చెల్లిని నిత్యం ఇంటికి తీసుకెళ్లేవాడు. ఆ సమయంలో ఆమెను లైంగికంగా వేధించేవాడు. ఎవరికైనా చెబితే మీ అక్క జీవితాన్ని నాశనం చేస్తానంటూ బెదిరించేవాడు. దాంతో ఆ యువతి మౌనంగా భరిస్తూ వచ్చింది. అలా ఎనిమిదేళ్ల పాటు నరకం చూపించిన బావ.. 2018లో తమిళనాడులోని ఓ గుడికి తీసుకెళ్లి బలవంతంగా తాళికట్టాడు. కొన్నిరోజుల పాటు అక్కడే ఉండి కామ వాంఛలు తీర్చుకున్నాడు. తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో..రవి కిరణ్ పీఎస్‌కు వెళ్లి తాము పెళ్లి చేసుకున్నామని చెప్పాడు. ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నానని ఆ యువతితో కూడా ఇంట్లో చెప్పించాడు.

పెళ్లైన తర్వాత రవికిరణ్ వేధింపులు మరింత పెరిగాయి. అంతేకాదు అనారోగ్యంతో ఉన్న తన భార్యను కూడా కొట్టడం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఆ యువతికి మళ్లీ పెళ్లి సంబంధాలు చూస్తున్నారని తెలిసి.. అత్తింటి వారితో గొడవపెట్టుకున్నాడు రవికిరణ్. అంతటితో ఆగక తన మరదలి నగ్న ఫొటోలను రహస్యంగా చిత్రీకరించి.. వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. దాంతో సహనం నశించిన ఆ యువతి.. గురువారం గుంటూరు రూరల్‌ ఎస్పీ స్పందన కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రవికిరణ్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: February 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు