అత్తింట్లో అరాచకం... భూతవైద్యం పేరుతో బాలింతకు చిత్రహింసలు

అత్తింట్లో అరాచకం... భూతవైద్యం పేరుతో యువతికి చిత్రహింసలు

ఈ సంఘటన గురించి తెలిశాక... ఇలాంటివి ఈ రోజుల్లో కూడా జరుగుతున్నాయా అనిపించకమానది. కళ్లముందు కనిపిస్తున్న సజీవ సాక్ష్యం ఇది.

 • Share this:
  కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాకలో ఉండేది ఆ యువతి. తల్లితండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. తన కాళ్లపై తాను నిలబడాలనుకుంది. బాగా చదువుకోవాలని... హైదరాబాద్ వచ్చి... ఓ ప్రైవేట్ ఉద్యోగం సంపాదించుకుంది. ఓవైపు చదువుకుంటూ... మరోవైపు ఉద్యోగం చేసుకుంటూ... తన బతుకు తాను బతుకుతోంది. ఇంతలో... మంచిర్యాల జిల్లా... జైపుర్ మండలం కుందారం గ్రామానికి చెందిన మల్లేశ్ ఆమె జీవితంలోకి ఎంటరయ్యాడు. నువ్వంటే ఇష్టం... నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నా... అంటూ వెంటపడ్డాడు. ప్రేమిస్తున్నా అన్నాడు. నిజమని నమ్మింది.

  పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు జన్మనిచ్చింది. 2 నెలల తర్వాత ఇక రోజూ నరకమే. మల్లేష్, అతని కుటుంబ సభ్యులు ఆమెలో ఏదో తేడా వచ్చిందనే డ్రామా ఆడి... భూతవైద్యుణ్ని రప్పించారు. వాడి ఓవరాక్షన్ ఓ రేంజ్‌లో సాగింది. నానా అరాచకం చేశాడు. ఆ పరిస్థితిలో ఆమె చిన్న మెదడుకు గాయమైంది. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లింది.

  విష.యం తెలుసుకున్న భీం ఆర్మీ తెలంగాణ చీఫ్ సెక్రటరీ వాసాల శ్రీనివాస్ స్వైరో ఆమెను కరీంనగర్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు ట్రై చేశారు. కరోనా కారణంగా... ఆస్పత్రిలో బెడ్స్ ఖాళీ లేవనడంతో... కరీంనగర్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. అక్కడా నిరాశే ఎదురైంది. చివరకు ప్రతిమ హస్పిటల్‌లో చికిత్స అందించేందుకు ట్రై చేశారు. చాలా ఆలస్యం కావడంతో... ఆమె పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. ప్రస్తుతం మల్లేష్ పారిపోయాడు. అతన్ని పట్టుకొని కఠినంగా శిక్షించాలని ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కోరుతున్నారు.

  మల్లేష్ లాంటి మాయగాళ్లు ప్రతి వీధిలో ఉంటున్నారు. వీళ్లు కరోనా కంటే డేంజర్ గాళ్లు. పైకి మంచిగా నటిస్తూ... లోపల పైశాచికానందం పొందే పరమ కిరాతకులు వీళ్లు. ఇలాంటి వాళ్లతో జాగ్రత్తగా ఉంటూ... అప్రమత్తంగా ఉండాలంటోంది ఈ వ్యధ.
  Published by:Krishna Kumar N
  First published: