Home /News /crime /

MAN HARASSED WOMEN WITH IRON BOX REASON BEHIND ILLEGAL RELATION RA

అక్రమ సంబంధం పెట్టుకున్నాడు... ఐరెన్ బాక్స్‌తో అంత పనిచేశాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంటికి రాగానే ఎవడితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగాడు.. మాటమాట పెరిగింది. దీంతో కమలేష్ పట్టలేని కోపంతో ఐరన్ బాక్స్ ఫ్లగ్‌లో పెట్టి బాగా వేడి అయ్యాక ప్రియురాలిని చితకబాది.. ఆమెను కిందపడేసి ప్రియురాలి మర్మాంగంపై..

    కొన్ని ఘటనలను చూస్తే వొళ్లు జలదరిస్తుంది. చాలామంది మనుషులమనే విషయమే మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో జరిగిన ఓ సంఘటనే ఇందుకు ఉదాహారణ. గుజరాత్‌కి చెందిన కమలేష్ అనే వ్యక్తికి వివాహం అయింది.. ఓవైపు భార్యతో కాపురం చేస్తూనే పక్కింటి మహిళతో అక్రమసంబంధం కొనసాగించాడు. పక్కింటి మహిళ కూడా అతని మోజులో పడి భర్తకు విడాకులు ఇచ్చేసింది.

    కొన్ని రోజులు వీరి వివాహేతర సంబంధం బాగానే ఉంది.. ఎప్పుడైతే మొదటి భర్తతో విడాకులు తీసుకుందో అప్పట్నుంచీ ఆ మహిళకు వేధింపులు ఎక్కువయ్యాయి. అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి వేధించడం మొదలుపెట్టాడు. ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో ఫోన్ మాట్లాడినా.. బయటికి ఎక్కడికి వెళ్లినా ఎవరితో మాట్లాడుతున్నావు.. ఎక్కడికి వెళ్తున్నావంటూ సవాలక్ష ప్రశ్నలతో వేధించేవాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగేవి.. ఈ నేపథ్యంలోనే ఆమె తాజాగా ఓ 20 నిమిషాలు నాన్‌స్టాప్‌గా ఫోన్‌లో మాట్లాడింది. బయట ఉన్న కమలేష్ ఆమెకి ఫోన్ చేయగా ఎంగేజ్ వచ్చింది.. దీంతో కోపానికి గురై మళ్లీ మళ్లీ చేశాడు.. అయినప్పటికీ అలానే కాల్ వెయిటింగ్ వచ్చింది.. దీంతో.. ఇంటికి రాగానే ఎవడితో మాట్లాడుతున్నావంటూ గొడవకు దిగాడు.. మాటమాట పెరిగింది. దీంతో కమలేష్ పట్టలేని కోపంతో ఐరన్ బాక్స్ ఫ్లగ్‌లో పెట్టి బాగా వేడి అయ్యాక ప్రియురాలిని చితకబాది.. ఆమెను కిందపడేసి ప్రియురాలి మర్మాంగంపై ఐరన్ బాక్స్‌తో వాత పెట్టాడు..

    ఈ ఘటనతో కేకలు వేసి ఏడ్చి ఏడ్చి ప్రేయసి స్పృహ తప్పిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లోనూ తాను చేసింది తప్పు కాదని భావించిన కమలేష్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. విషయం గ్రహించిన స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స అనంతరం స్పృహలోకి వచ్చిన బాధితురాలి తనకి విషయాన్నంత పోలీసులకు తెలపడంతో కేసు నమోదు చేసుకుని కమలేష్‌ని అదుపులోకి తీసుకున్నారు.
    First published:

    Tags: Crime, Illegal affairs, National News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు