MAN HACKS WIFE TO DEATH OVER EXTRA MARITAL AFFAIR WITH BROTHER IN LAW IN MEERUT PVN
Shocking : భర్త సోదరుడితో భార్య వివాహేతర సంబంధం..అది తెలిసిన భర్త ఏం చేశాడో తెలుసా
ప్రతీకాత్మకచిత్రం
Extramarital Affair : ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు,అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి. అక్రమ సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వేలం వెర్రిగా బయటపడుతున్నాయి.
Husband Kills Wife Over Extramarital Affair : ఇటీవలి కాలంలో భార్యాభర్తల మధ్య బంధాలు,అనుబంధాలు, రాగాలు, అనురాగాలు మంటగలసి పోతున్నాయి. అక్రమ సంబధాలతో హత్యలకు వెనకాడడం లేదు. ఈ జిల్లా ఆ జిల్లా అన్న తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటీవలి కాలంలో ఇలాంటి ఘటనలు వేలం వెర్రిగా బయటపడుతున్నాయి. అన్నింట్లోనూ అక్రమ సంబంధాలదే ప్రధాన భూమికగా మారింది. తాజాగా ఓ భర్త...తన సోదరుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందన్న అనుమానంతో భార్యను హత్య చేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లోని ఖర్ఖోడా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన తర్వాత నేరుగా భర్తే స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు. అనంతరం పోలీసు అధికారులు ఫోరెన్సిక్ బృందంతో సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. అనంతరం బాధితురాలి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
వినోద్ అలియాస్ మురళి అనే వ్యక్తికి ఎనిమిదేళ్ల క్రితం హాపూర్‌లోని ధౌలానా నివాసి పూనమ్‌తో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే పూనమ్ వ్యవహారశైలిపై వినోద్‌కు కొంతకాలంగా అనుమానాలు ఉన్నాయి. పూనమ్ తన బావమరిదితో అక్రమ సంబంధం పెట్టుకుందని వినోద్ అనుమానించాడు. ఇదే విషయమై పలుమార్తు వీరిమధ్య గొడవలు కూడా జరిగాయి. అయినప్పటికీ తన భార్య..తన సోదరుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని వినోద్ అనుమానించాడు.
ఈ క్రమంలో సోమవారం ఉదయం గర్భవతిగా ఉన్న భార్యను నిద్రలేపి మరీ..పదునైన ఆయుధంతో ఆమెపై వినోద్ దాడి చేశాడు. ఇదే సమయంలో వీరి పొరుగింట్లో ఉండే ప్రేమ్ చంద్ అనే వ్యక్తి..నిందితుడిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అయితే అతడిని బెదిరించి అక్కడి నుంచి పారిపోయేలా చేశాడు. ఇక,తీవ్ర గాయాలతో వినోద్ భార్య స్పాట్ లోనే మరణించింది. అనంతరం హత్య చేసిన ఆయుధాన్ని పొలంలో పడేసి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పూనమ్ తండ్రి ఫిర్యాదు మేరకు వినోద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో.., తన భార్య తన బావ సహాయంతో చంపేస్తానని బెదిరించేదని వినోద్ పోలీసులకు చెప్పాడు.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.