హోమ్ /వార్తలు /క్రైమ్ /

Husband Kills Wife : బ్రష్ చేయకుండా ముద్దు పెట్టుకోవద్దన్న భార్య.. దారుణంగా చంపిన భర్త!

Husband Kills Wife : బ్రష్ చేయకుండా ముద్దు పెట్టుకోవద్దన్న భార్య.. దారుణంగా చంపిన భర్త!

భార్యను చంపిన భర్త

భార్యను చంపిన భర్త

Husband Kills Wife : కలకాలం తోటుగా ఉంటానని మాటిచ్చిన భార్యకు భర్త ఆమె పాలిట కిరాతకుడిగా మారాడు. పళ్లు తోముకోకుండా కొడుకుని ముద్దు పెట్టుకోవడాన్ని అడ్డుకుందని జీవితభాగస్వామిని హతమార్చాడు.

Husband Kills Wife : కలకాలం తోటుగా ఉంటానని మాటిచ్చిన భార్యకు భర్త ఆమె పాలిట కిరాతకుడిగా మారాడు. పళ్లు తోముకోకుండా కొడుకుని ముద్దు పెట్టుకోవడాన్ని అడ్డుకుందని జీవితభాగస్వామిని హతమార్చాడు. కేరళ(Kerala) పాలక్కాడ్ జిల్లాలోని మన్నార్క్కాడ్ కరక్కురిస్సీలో మంగళవారం ఈ విషాదం చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...పాలక్కాడ్(Palakkad) జిల్లాలోని మన్నార్క్కాడ్ కరక్కురిస్సీలో నివాసముంటున్న 30 ఏళ్ల అవినాష్- దీపిక(28)కి 2019లో పెళ్లి జరిగింది. అవినాష్ కు ఇది రెండో వివాహం. అతడి మెదటి భార్య ఒడిషా రాష్ట్రానికి చెందినది కాగా కుటుంబకలహాల నేపథ్యంలో ఆమెకు విడాకులిచ్చి 2019లో తమిళనాడులోని కోయంబత్తూరుకి చెందిన దీపికను పెళ్లి చేసుకున్నాడు. అవినాశ్ ఎయిర్​ఫోర్స్ సివిల్ కాంట్రాక్ట్ కంపెనీలో సహాయ సూపర్​వైజర్​గా పనిచేస్తున్నాడు. అవినాష్-దీపిక దంపతులకు ఏడాదిన్నర వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు. అయితే అవినాష్ మంగళవారం ఉదయం నిద్ర లేవగానే తన కుమారుడిని ముద్దాడేందుకు ప్రయత్నించాడు. అయితే భర్త పళ్లు తోముకోకపోవడంతో భార్య దీపిక దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

Shoking : పెళ్లైన 5 నెలలకే..కట్నం తేలేదని భార్యను చంపి శవాన్ని అదృశ్యం చేసిన భర్త,అత్తమామలు

దీంతో దంపతుల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. కోపంతో అవినాష్ వారి కొడుకు ముందే దీపికపై కొడవలితో దాడి చేశాడు. ఆమె మెడ, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. అరుపులు విన్న ఇరుగుపొరుగు ఉదయం 9 గంటల సమయంలో అవినాష్ ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో రక్తపు మడుగులో పడి ఉన్న దీపిక పక్క ఆమె కుమారుడు ఐవిన్‌తో ఏడుస్తూ ఆమెను కౌగిలించుకుని ఉంటం వారికి కనిపించింది. దీపిక పక్కనే కొడవలి పట్టుకుని నిలబడిన అవినాష్‌ను కూడా స్థానికులు చూశారు. దీపికను 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న  ఆసుపత్రికి తరలించారు. అయితే, కొద్దిసేపటికే ఆమె తీవ్ర గాయాలతో మరణించింది.


దీపిక స్వస్థలం కోయంబత్తూరు. అవినాష్ బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా బెంగళూరులో ఉంటున్న దంపతులు రెండు నెలల క్రితం మన్నార్‌క్కాడ్‌కు వెళ్లారు. స్థానికులు అవినాష్‌ను పోలీసులకు అప్పగించారు. అవినాష్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published:

Tags: Husband kill wife, Kerala

ఉత్తమ కథలు