• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAN HACKS MOTHER SISTER TO DEATH WITH AXE IN CHHATTISGARH BA

తల్లి, చెల్లిని గొడ్డలితో నరికి చంపిన యువకుడు...

షౌకత్‌తో పాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకుని విచారణ.

ఓ యువకుడు తన తల్లి, చెల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది.

  • Share this:
    ఓ యువకుడు తన తల్లి, చెల్లిని గొడ్డలితో నరికి చంపాడు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్ గఢ్ రాజధాని రాయిపూర్‌కు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ముంగేలీ అనే టౌన్‌లో అనిల్ యాదవ్ అనే యువకుడు తన తల్లిని, చెల్లిని చంపాడు. తన తల్లితో ఈ రోజు గొడవ పెట్టుకున్నాడు అనిల్. ఆ తర్వాత ఆమె మీద గొడ్డలితో దాడి చేశాడు. ఆ దాడిలో తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తల్లి మీద సోదరుడు జరుపుతున్న దాడిని అడ్డుకోబోయిన 19 ఏళ్ల మధుకి కూడా గొడ్డలి దెబ్బలు పడ్డాయి. దీంతో బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. ఇరుగుపొరుగువారు అందించిన సమాచారం మేరకు పోలీసులు నిందితుడు అనిల్ యాదవ్‌ను అరెస్ట్ చేశారు. అతడి మీద హత్య కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అయితే, అసలు అనిల్ యాదవ్, తల్లితో ఎందుకు గొడవ వచ్చిందనేది తెలియాల్సి ఉంది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: