దారుణం... టపాసులు కాల్చినందుకు కొట్టి చంపారు...

సుమారు 15 మంది గ్యాంగ్.. అమరేష్ మీద పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు.

news18-telugu
Updated: October 28, 2019, 5:13 PM IST
దారుణం... టపాసులు కాల్చినందుకు కొట్టి చంపారు...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టపాసులు కాల్చినందుకు కొందరు వ్యక్తులు ఓ యువకుడిని కొట్టి చంపారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. భువనేశ్వర్‌లోని సుందరపాద ప్రాంతంలో అమరేష్ నాయక్ అనే యువకుడు దీపావళి రాత్రి టపాసులు కాలుస్తున్నాడు. అయితే, కొందరు యువకులు ఆ మార్గంలో వెళ్తూ.. టపాసులు కాలుస్తున్న అమరేష్‌తో గొడవ పెట్టుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. అది చినికి చినికి గాలివానగా మారి.. సుమారు 15 మంది గ్యాంగ్.. అమరేష్ మీద పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. అమరేష్ నాయక్ కుటుంబసభ్యులు వెంటనే బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు అప్పటికే చనిపోయినట్టు ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు.

మరోవైపు దీపావళి రోజు జరిగిన ఘటనల్లో మరో ఇద్దరు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. భద్రక్ జిల్లాలో తన ఇంటికి దీపావళి డెకరేషన్ చేస్తుండగా విద్యుత్ షాక్ కొట్టి ఓ వ్యక్తి చనిపోయాడు. మరో జిల్లాలో దీపావళి టపాసులు కాలుస్తుండగా, నిప్పురవ్వలు పడి ఇల్లు కాలిపోయింది. ఆ మంటల్లో పడి మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

అయ్యయ్యో.. టపాసులు కాలుస్తుంటే.. కారు ఢీకొట్టేసింది...



First published: October 28, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...