Home /News /crime /

Chennai : మూడు నెలలకే.. ఓ పెళ్లి.. ఏడు పెళ్లిలు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు

Chennai : మూడు నెలలకే.. ఓ పెళ్లి.. ఏడు పెళ్లిలు చేసుకున్న నిత్యపెళ్లి కొడుకు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Chennai : పెళ్లైన మూడు నెలలకే మరో పెళ్లి చేసుకుంటున్న పెళ్లికొడుకు , ఇలా ఏడు పెళ్లీలు చేసుకుంటున్న నిత్య పెళ్లికొడుకును పోలీసులు అరెస్ట్ చేశారు.

    కొంతమంది వ్యక్తులకు నిత్యం పెళ్లిలు చేసుకోవడమే అలవాటుగా మారుతోంది. ఇలా పెళ్లిళ్ల పేరయ్యలు నిత్యం మనకు దేశంలో ఏదో చోట కొనుసాగుతున్నాయి. ( man got 7 marriages )అయితే పెళ్లిల్లు చేసుకుంటున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. చివరగా ఏడు పెళ్లిలు చేసుకున్న వ్యక్తిని కటకటాలపాలు చేశారు.

    వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ( Tamilnadu ) తిరునల్వేలి ఎన్జీవో కాలనీలో నివసిస్తున్న గణేశన్‌ కుమార్తె విజిలా రాణి (33)కి, తూత్తుకుడి జిల్లా సాయర్‌పురానికి చెందిన విన్సెంట్‌ రాజన్‌ అనే యువకుడితో గత యేడాది జూలై 15న వివాహం జరిగింది. మూడు నెలలపాటు వీరి దాంపత్యం అన్యోన్యంగా కొనసాగింది. ( man got 7 marriages ) ఆ తర్వాత ఏదో వ్యాపారం కోసమంటూ విజిలా రాణి నుండి 40 సవర్ల నగలు, రూ.3లక్షల నగదు తీసుకుని రాజన్‌ పారిపోయాడు.


    Karimnagar : ఓటర్లు లేకుండానే ఎన్నికల ప్రచారం.. స్థానికంలో అభ్యర్థుల అయోమయం


    నెలలు గడిచినా భర్త తిరిగి రాకపోవడంతో అనుమానించిన విజిలా రాణి ఆ విషయాన్ని తండ్రికి తెలిపింది. దీంతో ఆయన మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విన్సెంట్‌రాజన్‌ ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. కొద్ది రోజుల గాలింపు తర్వాత రెండు రోజుల క్రితం విన్సెంట్‌ రాజన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల స్టైల్లో విచారణ చేపట్టారు. ( man got 7 marriages )దీంతో నిత్యపెళ్లికొడుకు బండారం బయటపడింది. ఇంతకు ముందే...ఇలా ఐదుగురు మహిళలను పెళ్లి చేసుకుని వారి నుండి నగదు, బంగారం ఎత్తుకెళ్లి వెళ్లినట్టు నిర్ధారించారు.


    Telangana corona : మరోసారి కరోనా నిబంధనలు.. మాస్క్ లేనివారికి 1000 జరిమాన


    పథకం ప్రకారం విన్సెంట్ ఆరుగురు యువతులను పెళ్ళి చేసుకుని మూడు నెలలు కాపురం చేసి నగలు, నగదు అపహరించుకెళ్ళాడని పోలీసులు కనుగొన్నారు. అంతేకాకుండా తన తల్లిగా, పినతల్లిగా నటించేందుకు ఇద్దరు మహిళలను రూ.15 వేలిచ్చి నటింపజేశాడని కూడా విచారణలో తేలింది.( man got 7 marriages ) కొద్ది రోజులకు ముందు విన్సెంట్‌ భాస్కర్‌ ఓ యువతిని ఏడో పెళ్ళి చేసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడని కూడా పోలీసుల విచారణలో వెల్లడైంది. విన్సెంట్‌ భాస్కర్‌, అతనికి తల్లిగా, పినతల్లిగా నటించిన ఇద్దరు మహిళలను కూడా అరెస్టు చేశారు.

    సాధారణంగా ఇలాంటీ సంఘటనలు రాజస్థాన్‌తో పాటు నార్త్ ఇండియాలో ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్లి సంబంధాల పేరుతో గ్యాంగ్‌లు ఏర్పడడం , మాట్రిమోనియల్ అడ్రస్‌లతో యువకులను బురిడి కొట్టించి పెళ్లిలు చేసుకుని , కేవలం రెండు లేదా మూడు రోజులు వారితో ఉంటూ సమయం చిక్కినప్పుడు ఇంట్లో ఉన్న బంగారం, డబ్బుతో పరారయ్యే కేసులు ఎక్కువగా నమోదు అవుతుంటాయి.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Chennai, Crime news

    తదుపరి వార్తలు