Home /News /crime /

MAN GETS DRUNK ON NIGHT OUT WAKES UP TO FIND HIMSELF BURIED IN COFFIN PAH

ఇదేందిరా నాయన.. శవపేటిక నుంచి మనిషి లేచి బయటకొచ్చాడు.. ట్విస్ట్ ఏంటంటే..

హ్యూగో మైకా అల్వారెజ్..

హ్యూగో మైకా అల్వారెజ్..

Viral news: వ్యక్తి రాత్రి ఇంటి బయటకు వెళ్లాడు. అప్పుడు, తన గ్రామస్థులతో సరదాగా గడిపాడు. కానీ ఉదయం లేచేసరికి మాత్రం ఏదో బాక్స్ లో తనను వేసి సీల్ చేసినట్లు గుర్తించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tamil Nadu, India
కొందరు తాగిన మత్తులో ఏంచేస్తారో వారికే తెలియదు. పూటుగా తాగి ఒక చోట వెళ్లాల్సింది కాస్త, మరోక చోటుకు వెళ్లిపోతుంటారు. అంతే కాకుండా.. కొన్నిసార్లు.. మద్యం మత్తులో ఏంచేస్తారో కూడా అర్థం కాదు. కొందరు గొడవ పడుతుంటారు. ఇష్టమోచ్చినట్లు ప్రవర్తిస్తుంటారు. మరికొందరు ఇతరులతో వాగ్వాదానికి దిగుతుంటారు. అయితే.. ఒక వ్యక్తి మద్యం మత్తులో చేసిన ఫన్నీ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. దక్షిణ అమెరికాలో (South America) వింత ఘటన చోటు చేసుకుంది. అక్కడ అర్జెంటీనా, పరాగ్వే, బొలీవియా అంతటా నివసిస్తున్న స్థానిక ప్రజలు వింతైన సాంప్రదాయం పాటిస్తుంటారు. గ్రహాలకు నైవేద్యంగా బతికున్న వ్యక్తిని సజీవంగా శవపేటికలో వేసి, పూడ్చిపెడుతుంటారు. అయితే.. విక్టర్ హ్యూగో మైకా అల్వారెజ్ (30).. బొలీవియాలోని ఎల్ ఆల్టో నగరంలో పాస్ అయిన తర్వాత శవపేటికలో సజీవంగా ఖననం చేయబడ్డాడు. అక్కడ గ్రామంలో.. పచమామా పండుగ (మదర్ ఎర్త్ ఫెస్టివల్) ప్రారంభంలో అల్వారెజ్ ముందు రోజు రాత్రి మద్యం సేవించాడు. ఇక్కడ ప్రజలు ప్రకృతికి, సహజ ప్రపంచానికి కృతజ్ఞతలు తెలుపుతారు.ఈ వేడుకను అక్కడి వారంతా జరుపుకుంటారు. ఆ తర్వాత.. రాత్రి ఎవరినైన శవపేటికలో వేసి, సజీవంగా బాతిపెడతారు. అయితే.. విక్టర్ ని కూడా అలాగే చేశారు. మద్యం మత్తు దిగిపోగానే అతగాడు.. లేవడానికి ప్రయత్నించాడు. కానీ శవపేటిక నుంచి లేవలేకపోయాడు. ఈ క్రమంలో.. అతను శవపేటికను పగలగొట్టుకుని పైకి లేచాడు. ఆ తర్వాత.. తన తన గ్రామంలోకి చేరుకున్నాడు. ఆ తర్వాత.. తనను చంపడానికి చూశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా పెళ్లిలో కొత్త జంట చేసిన పనిప్రస్తుతం ఫన్నీగా మారింది.

పెళ్లి వేడుక గ్రాండ్ గా జరుగుతుంది. కొత్త జంట అదిరిపోయే కాస్టూమ్ వేసుకున్నారు. ఇద్దరు కూడా కుంకుమ రంగులో మ్యాచింగ్ వస్త్రాలు ధరించారు. అతిథులు, బంధువులు, స్నేహితులు పెద్ద ఎత్తున హజరయ్యారు. అప్పుడు కొత్త జంట ఒకరి నోటిలో మరోకరు తీపి పదార్థాలను తినిపించుకుంటున్నారు. అప్పుడు షాకింగ్ ఘటన జరిగింది. వరుడి నోట్లో వధువు.. ప్లేట్ లో ఉన్న స్వీట్ పెట్టడానికి ట్రై చేసింది. కానీ దీనికి వరుడు నిరాకరించాడు. ఆమెకు అందకుండా దూరంగా జరిగాడు.

దీంతో వధువు చిర్రెత్తుకొచ్చింది. అతని మీద పడి మరీ తినిపించడానికి ట్రైచేసింది. దీంతో ఇద్దరు ఒకరిని మరోకరు తోసుకుంటున్నారు. సరదాగా చేసిన పనికాస్త.. కొత్త జంట కొట్టుకొవడం వరకు వెళ్లింది. అక్కడ ఉన్న వారు.. ఆపడానికి ప్రయత్నించినప్పటికి ఎవరు తగ్గడంలేదు. ఈ ఘటన ఎక్కడ జరిగిందో వివరాలు లేవు. ప్రస్తుతం ఈ వీడియో మాత్రం వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. అవాక్కవుతున్నారు.. మరికొందరు.. ఇదేందిరా నాయన అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.
Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, South america

తదుపరి వార్తలు