హోమ్ /వార్తలు /క్రైమ్ /

Crime News : ఇంటికి లేట్ గా వచ్చి బెడ్రూమ్ తలుపు తట్టాడు.. భార్య డోర్ ఎంతకీ తీయలేదు.. చివరికి ఆ భర్త..

Crime News : ఇంటికి లేట్ గా వచ్చి బెడ్రూమ్ తలుపు తట్టాడు.. భార్య డోర్ ఎంతకీ తీయలేదు.. చివరికి ఆ భర్త..

Crime News : కొన్ని జంటలు .. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసుకుని పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు.

Crime News : కొన్ని జంటలు .. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసుకుని పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు.

Crime News : కొన్ని జంటలు .. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసుకుని పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు.

  భార్య భర్తల(Wife And Husband) మధ్య గొడవలు, మనస్పర్థలు అనేవి సహజం. ఒకరు అలిగి కూర్చుంటే.. మరొకరు దగ్గరకు వెళ్లి.. ఓదార్చి సంసారాన్ని ముందుకు సాగించాలి. ప్రస్తుతం సమాజంలో జరిగేది కూడా ఇదే. కానీ కొన్ని జంటలు ఇలా కాకుండా.. చిన్న చిన్న విషయాలకు కూడా పెద్ద రాద్ధాంతం చేసుకుని పచ్చని సంసారాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎంత ప్రశాంతంగా ఉందామని అనుకున్నాసరే కొందరి ఇళ్ళల్లో భార్య భర్తల మధ్య గొడవలు వస్తూనే ఉంటాయి. నిజంగా వీటికీ అస్సలు ఫుల్స్టాప్ అంటూ ఉండదు. ప్రతి రోజూ ఏదో ఒక చిన్న దానికి కూడా గొడవలు వస్తూనే ఉంటాయి.చివరకు ఆ గొడవలను పంచాయితీల వరకూ తీసుకెళ్తుంటారు. మరికొందరైతే దాడి చేయడమో, ప్రాణాలు తీయడమో చేస్తుంటారు. కానీ, అహ్మదాబాద్‌లో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పని మీద బయటికి వెళ్లిన భర్త.. ఆలస్యంగా ఇంటికొచ్చాడు. బెడ్‌రూం తలుపు తట్టినా భార్య ఎంతకీ తీయలేదు. మనోడు అసలకే అనుమానపు పిశాచి. దీంతో అనుమానంతో తలుపులను మరింత గట్టిగా బాదాడు. ఆ తర్వాత అతడు చేసిన పని వాళ్ల సంసారాన్ని గందరగోళంలోకి నెట్టేసింది.

  పూర్తి వివరాల్లోకెళితే.. గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ పరిధిలోని షాపూర్ ప్రాంతంలో ఓ కుటుంబం నివాసం ఉంటోంది. ఈ దంపతులకు 2019లో వివాహమైంది. ప్రస్తుతం వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. భర్త పని నిమిత్తం నిత్యం బయటికి వెళ్తూ ఉంటాడు. ఈ క్రమంలో కొన్నిసార్లు ఇంటికి ఆలస్యంగా వస్తూ ఉంటాడు.

  ఎప్పటి లాగే ఆ రోజు కూడా ఇంటికి ఆలస్యంగా వచ్చాడు. బెడ్‌రూం తలుపు కొట్టగా భార్య ఎంతకీ తలుపు తీయలేదు. మనోడు తలుపు తీయమని పెద్ద పెద్దగా అరిచాడు. కానీ, ఆమె నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీంతో అనుమానం, కోపంతో మరింత గట్టిగా తలుపులను బాదడం మొదలెట్టాడు. కాసేపటికి తలుపు తెరచిన భార్యపై ఆగ్రహంతో ఊగిపోయాడు.

  " ఇంతసేపు తలుపు తీయకుండా ఏం చేస్తున్నావ్.. లోపల ఎవరున్నారు " అంటూ దుర్భాషలాడాడు. పడుకుని ఉండడంతో తలుపు తీయడం ఆలస్యమైందని భార్య చెబుతున్నా.. అతగాడు ఏ మాత్రం వినిపించుకోలేదు. అనుమానపు బూతం తలకెక్కింది. దీంతో, మరింత కోపంతో భార్యను బలంగా నేలకేసి కొట్టాడు. గొంతు పట్టుకుని చంపడానికి కూడా ప్రయత్నించాడు.

  ఇది కూడా చదవండి : గన్స్‌ పట్టుకొని ఆడవాళ్లు అగ్లీ డ్యాన్స్ ..బీహార్‌లో ఎంత తెగించార్ర బాబోయ్

  అంతటితో ఊరుకోకుడా.. ఆ తర్వాత కొడుకుతో సహా భార్యను ఇంటి నుంచి బయటికి గెంటేశాడు. దీంతో ఏమి చేయాలో పాలుపోక ఆ ఇల్లాలు పోలీసులను ఆశ్రయించి భర్తపై ఫిర్యాదు చేసింది. వరకట్నం కోసం వివిధ సాకులు చూపి నిత్యం దాడి చేస్తుంటాడని వాపోయింది. ఈ సారి తలుపు ఆలస్యంగా తీసిందని ఇలా చేశాడంటూ మీరే ఈ సమస్యను పరిష్కరించాలని పోలీసుల్ని వేడుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  First published:

  Tags: Ahmedabad, Crime, Crime news, Wife and husband

  ఉత్తమ కథలు