భార్యకు దోమల మందు తాగించి... చంపేశాడు... కారణం ఇదీ...

Murder : తన భార్య వేరే మగాడితో ఫోన్‌లో మాట్లాడటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆమెతో బలవంతంగా మస్కిటో రిపెల్లెంట్ (దోమల్ని చంపే స్ప్రే) తాగించాడు. తర్వాత పీక పిసికి చంపేశాడు.

Krishna Kumar N | news18-telugu
Updated: August 2, 2019, 2:31 PM IST
భార్యకు దోమల మందు తాగించి... చంపేశాడు... కారణం ఇదీ...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దోమల్ని చంపేందుకు వాడే మస్కిటో రిపెల్లెంట్ (స్ప్రే)... దోమలకే కాదు మనకూ ప్రమాదమే. దాన్ని తాగితే... కడుపులో తిప్పేస్తుంది. ఈ విషయం తెలుసుకున్న ఆ భర్త... తన భార్యను అదే మస్కిటో రిపెల్లెంట్‌తో చంపేయాలనుకున్నాడు. అది బెడిసికొట్టడంతో... పీక పిసికి చంపేశాడు. 26 ఏళ్ల ఆ యువకుణ్ని పోలీసులు అరెస్టు చేశారు. ఆగ్రాలో జరిగిందీ ఘటన. హంతకుడి పేరు సోనీ. కూరగాయల వ్యాపారి. బాధితురాలు అంజలీ. వీళ్లకు 9 ఏళ్ల కిందటే పెళ్లైంది. అంటే అది బాల్య వివాహం అన్నమాట. వీళ్లకు ఇద్దరు పిల్లలున్నారు. ఒకరి వయసు ఆరేళ్లు. మరొకరికి నాలుగేళ్లు. ఆగ్రాలోని సుదాంపురి ఏరియాలో ఆమె ఇంటికి కాస్త దూరంలో ఖాళీగా ఉన్న ఫ్లాట్‌లో అంజలీ శవమై కనిపించింది.

ఇన్నేళ్లు కలిసున్న ఆ జంట మధ్యలో ఎందుకు గొడవలు జరిగాయి అన్నది తేలాల్సిన అంశం. పోలీసుల ప్రకారం... తన భార్య వాట్సాప్‌లో మరో కుర్రాడితో పగల బడి నవ్వుతూ చాటింగ్ చెయ్యడం చూసి తట్టుకోలేకపోయాడు సోనూ. అవతలి వ్యక్తి ఎవరు? ఏంటి? అన్నది ఏదీ ఆలోచించలేదు సోనూ. తన కూరగాయల దుకాణానికి వచ్చేవాళ్లు చెప్పే తప్పుడు మాటలు బాగా నమ్మాడు. ఇంట్లో భార్యను ఒంటరిగా వదిలెయ్యకూడదనీ, అలాంటి వాళ్లతో ఎవరో ఒకరు కనెక్టై... వివాహేతర సంబంధం కొనసాగిస్తారని... కస్టమర్లలో కొందరు చెప్పడంతో... అదే నిజమని నమ్మాడు సోనూ. అదే భ్రమల్లో బతికాడు. ఆ పరిస్థితుల్లో ఆమె వాట్సాప్‌లో ఫోన్ మాట్లాడటం సోనూకి లేనిపోని అనుమానాలు కలిగించింది.

రాన్రానూ భార్యపై నమ్మకం తగ్గిపోయింది. అంజలీ తనను మోసం చేస్తోందనీ, వేరే ఎవరితోనే గడుపుతోందనీ పిచ్చి పిచ్చి ఆలోచనలు పెంచుకున్నాడు. ఆమెను చూస్తేనే అసహ్యం వేసే పరిస్థితి వచ్చేశాడు. ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. ఆ రాత్రి సమయంలో అతనికి దోమల్ని చంపేందుకు వాడే స్ప్రే కనిపించింది. ఇంటి తలుపులు మూసేసి... స్ప్రే తెచ్చి... ఆమె నోట్లో పెట్టి... బలవంతంగా ప్రెస్ చేశాడు. ఆమె ఎంత గింజుకుంటున్నా... వెనక్కి తగ్గలేదు. స్ప్రే లిక్విడ్ కడుపులోకి వెళ్లి... ఆమె కడుపు నొప్పితో అరుస్తుంటే... అందరికీ తెలిసిపోతుందనీ కంగారు పడ్డాడు. చచ్చిపోతుందనుకుంటే... చావట్లేదేంటి అనుకుంటూ... లాభం లేదు నేనే చంపేయాలి అని... పక్కనే ఉన్న టవల్‌ను గొంతు చుట్టూ చుట్టి... పీక పిసకడం మొదలుపెట్టాడు. తన భర్తే అలా చేస్తుంటే... ఆమెకు ఏం చెయ్యాలో కూడా అర్థం కాలేదు. తన తప్పేమీ లేదని చెప్పుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అలా విలవిలలాడుతూ... ఆమె భర్త చేతిలోనే ప్రాణాలు విడిచింది.

ఈ మొత్తం ఘటన జరుగుతున్నప్పుడు... నిద్రపోతున్న పిల్లలు కాస్తా నిద్ర లేచారు. ఏడ్వటం మొదలుపెట్టారు. ఏదో జరుగుతోంది... కానీ అదేంటో ఆ పిల్లలకు అర్థం కాలేదు. తమ ఆలనా పాలనా చూసే తల్లి ఏడుస్తుంటే... వాళ్లకూ ఏడుపొచ్చేసింది. ఆమె చనిపోయాక... ఆమెపై పడి తెగ ఏడ్చారు. హత్య నుంచీ తప్పించుకోవాలనుకున్న సోనూ... ఆమెను మోసుకెళ్లి... దగ్గర్లో ఖాళీగా ఉన్న ఓ ఫ్లాట్‌లో పడేశాడు. తెల్లారి ఆ ఇంటికి వచ్చిన అంజలి తండ్రి... తన కూతురు ఎక్కడని ప్రశ్నించాడు. సోనూ మాటల్లో ఏదో తేడా కొట్టింది. పిల్లలు వచ్చీ రాని పలుకులతో... చెప్పిన మాటల్లో అంతరార్థాన్ని పెద్దాయన అర్థం చేసుకున్నాడు. అల్లుణ్ని నిలదీశాడు. నిజం తెలియడంతో... పెద్దాయన కుప్పకూలిపోయాడు. తర్వాత తేరుకొని... పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు. డెడ్ బాడీని పోస్ట్‌మార్టంకీ, సోనూను పోలీస్ స్టేషన్‌కీ తరలించారు పోలీసులు. ఇలా తల్లి తిరిగిరాని లోకాలకూ, తండ్రి జైలుకీ వెళ్లడంతో... దిక్కులేని వారిలా అయిపోయారు ఆ పిల్లలు. వాళ్లను చూసుకునే బాధ్యత ఇప్పుడా పెద్దాయనపై పడింది.అనుమానం పెనుభూతం లాంటిది. భార్యాభర్తల మధ్య బేదాభిప్రాయాలు, మనస్పర్థలూ రావడం సహజం. ఏదైనా ఉంటే... కలిసి మాట్లాడుకొని సెటిల్ చేసుకోవాలే తప్ప... ఇలా అనుమానాలకూ, పిచ్చి ఆలోచనలకూ తావిస్తే... ఫలితం విషాదమే అవుతుందంటోంది ఈ క్రైమ్ స్టోరీ.
First published: August 2, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు