ఆఫీసు పని ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఓ యువతికి మెట్రో రైల్లో తీవ్ర అభ్యంతరకరపమైన పరిస్థితి ఎదురైంది. ఓ యువకుడు ఆమె ఎదురుగా నిలబడి ప్యాంట్ తీసి మర్మాంగాన్ని చూపిస్తూ వెకిలిచేష్టలు చేశాడు. దీంతో బాధితురాలు హతాశురాలైంది. తనకు ఎదురైన పరిస్థితిని ఆమె ప్రముఖ సోషల్ మీడియా ట్విట్టర్‌లో పేర్కొంది. ఢిల్లీ నుంచి గురుగ్రామ్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ట్విట్టర్‌లో ఆమె రాసిన దాని ప్రకారం.. ‘కుడి వైపు ఉన్న ఈ యువకుడు, గ్రే కలర్ జాకెట్ వేసుకుని, బ్యాక్ ప్యాక్ వేసుకున్న వ్యక్తి) తన మర్మాంగాన్ని బయటకు తీసి నా వైపు చూపించాడు. నేను విధులు ముగించుకుని గురుగ్రామ్ వెళ్తున్న సమయంలో సాయంత్రం 6 గంటలకు ఢిల్లీ మెట్రోలో ఈ ఘటన జరిగింది. అతడి ప్రవర్తన చూసి వణికిపోయా. భయమేసింది. కోపం వచ్చింది. కనీసం అతడి ఫోటో తీసుకున్న విషయం కూడా నాకు కొన్ని గంటల వరకు గుర్తు లేదు.’ అని ఢిల్లీ మెట్రోను ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది.
‘ఆఫీసు నుంచి వస్తూ మెట్రోలో ఏడో కోచ్‌లో రెండో సీటు వద్ద కూర్చున్నా. ఈ వ్యక్తి వచ్చి నా ఎదురుగా నిలబడ్డాడు. తీరా చూస్తే అతడి ప్యాట్ జిప్ తీసి ఉంచాడు. మర్మాంగం నా వైపు చూపించాడు. ఆ దృశ్యం చూసి జుగుప్స కలిగింది. అతడు తన మర్మాంగాన్ని బయటకు తీసి దాన్ని కవర్ చేయడానికి అతడి బ్యాగ్‌ను అడ్డం పెట్టుకున్నాడు. ఆ సమయంలో ఏం జరుగుతుందో, ఎక్కడ ఉన్నామో, ఏంచేయాలో కూడా నాకు అర్థం కాలేదు. కొంతసేపటి తర్వాత అతడు డోర్ దగ్గరికి వెళ్లి నిలబడ్డాడు. అతడి ఫోటో తీసుకున్న సమయం చూస్తే సాయంత్రం 6.11 గంటలు, సుల్తాన్‌పూర్ వాటర్ ప్లాంట్ అని ఉంది. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతడు ఏ స్టేషన్‌లో దిగిపోయాడో కూడా చూడలేదు. నేను పూర్తిగా తలదించుకుని ఉండిపోయా. నేల వైపే చూస్తూ ఉండిపోయా. ఈ విషయాన్ని మా స్నేహితురాలికి ఫోన్ చేసి చెబితే వెంటనే ఫిర్యాదు చేయమని ప్రోత్సహించింది. అప్పటికప్పుడు పది మందిని పిలిచి నాలుగు తగిలించనందుకు బాధపడుతున్నా. నా మొట్టమొదటి ట్వీట్ లైంగిక వేధింపుల గురించి పెట్టడం బాధగా ఉంది.’ అని వరుస ట్వీట్లు చేసింది.
బాధితురాలి ఫిర్యాదుపై ఢిల్లీ మెట్రో కార్పొరేషన్ స్పందించింది. ఇలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే 155370 (ఢిల్లీ మెట్రో హెల్ప్ లైన్) లేదా 155655 (సీఐఎస్ఎఫ్ హెల్ప్ లైన్) నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించింది. అలాగే, సమీపంలోని మెట్రో స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Delhi metro