Escapes from Quarantine: అసలే దొంగ.. ఆపై కరోనా పాజిటివ్​.. పోలీసులకు ఛాలెంజ్​ చేసి ఎస్కేప్.. అలా ఎందుకు చేశాడంటే..​

ప్రతీతాత్మక చిత్రం

కొంత మంది రోగులు కరోనాతో దాగుడు మూతలు ఆడుతూ.. దేశంలో వైరస్​ ఉధృతి పెరగడానికి కారణమవుతున్నారు. బయట తిరుగుతూ ఇతరులకు కరోనా అంటిస్తున్నారు.

  • Share this:
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్​ విజృంభిస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు, వేలల్లో మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా పాజిటివ్​ నిర్థారణ అయిన వారిని హోమ్​ క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నారు వైద్యులు. స్వల్పకాలిక లక్షణాలతో కరోనా వచ్చిన వారిని సెల్ఫ్​ క్వారంటైన్​లో ఉండాల్సిందిగా చెబుతున్నారు. అయితే కొంత మంది రోగులు కరోనాతో దాగుడు మూతలు ఆడుతూ.. దేశంలో వైరస్​ ఉధృతి పెరగడానికి కారణమవుతున్నారు. హోమ్​ క్వారెంటైన్​లో ఉండాల్సిన వారు బయట తిరుగుతూ ఇతరులకు కరోనా అంటిస్తున్నారు. క్వారంటైన్​ నుంచి పారిపోయి మెడికల్​ సిబ్బంది, పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. తాజాగా ముంబై నగరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. షాబుల్లా ఖాన్ అనే వ్యక్తి ముంబైలోని బాంద్రా, బోరివాలి మధ్య ఉన్న అనేక దుకాణాల్లో చొరబడి విలువైన వస్తువులను దొంగతనం చేశాడు. దీంతో పోలీసులు అతడ్ని పట్టుకొని అరెస్ట్​ చేశారు. నిందితుడికి కరోనా పరీక్షలు చేయగా.. పాజిటివ్​గా నిర్ణారణ అయ్యింది. దీంతో సదరు నిందితుడ్ని బోరివాలి (వెస్ట్) లోని సాయి నగర్​లో గల క్వారంటైన్​ సెంటర్​కు తరలించారు. అయితే కొద్ది సేపటికే మెడికల్​ సిబ్బంది కళ్లుగప్పి క్వారంటైన్​ సెంటర్​ నుంచి తప్పించుకున్నాడు నిందితుడు. సిబ్భంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న కండివాలీ స్టేషన్​ పోలీసులు రంగంలోకి దిగి 24 గంటల్లో అతడ్ని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. క్వారంటైన్​ కేంద్రం నుండి ఎందుకు పారిపోయావని పోలీసులు ప్రశ్నించగా.. తన భార్యను చూడక చాలా రోజులైందని.. ఆమెను కలవాలనుకొని పారిపోయాని సమాధానమిచ్చాడు. అతడు చెప్పిన సమాధానం విని ఖంగుతిన్నారు పోలీసులు.

పోలీసులకు ఛాలెంజ్​ చేసి మరీ ఎస్కేప్​..
కరోనా పాజిటివ్​ రావడంతో క్వారంటైన్​ సెంటర్​కు నిందితుడ్ని తరలించిన సందర్భంలో ‘నేను ఇక్కడి నుంచి రెండు రోజుల్లో తప్పించుకుంటా’ అంటూ పోలీసులకు సవాలు విసిరాడు. చెప్పినట్లుగానే క్వారంటైన్​ సెంటర్​ నుంచి పారిపోయాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడు నివసించే ఓషివారా ప్రాంతంలో గాలించి ఎట్టకేలకు పట్టుకున్నారు. నిందితుడు ఓ ఫార్మసీ నుండి రెమ్‌డెసివిర్‌ను దొంగిలించాడన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నాడు. మరోవైపు ముంబైలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో నగరంలో కొత్తగా 4,192 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనాతో 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
First published: