హోటల్ గదిలో ఒంటరిగా హీరోయిన్.. లోపలికి వెళ్లిన యువకుడు ఏం చేశాడంటే..

హీరోయిన్‌ను వేధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబైలో కూడా ఇలాగే చేశాడట. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా మారలేదు. ఇప్పుడు వారణాశిలో కూడా హోటల్ గదిలో నానా హంగామా సృష్టించాడు.

news18-telugu
Updated: May 26, 2019, 10:38 PM IST
హోటల్ గదిలో ఒంటరిగా హీరోయిన్.. లోపలికి వెళ్లిన యువకుడు ఏం చేశాడంటే..
భోజ్‌పురి హీరోయిన్ రీతు సింగ్
  • Share this:
ఓ హీరోయిన్ హోటల్ గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు దూసుకుంటూ లోనికి వెళ్లిపోయాడు. ఈ హఠాత్పరిణామానికి ఆమె షాక్‌కి గురైంది. అయితే, ఆ యువకుడు హోటల్ గదిలోపలికి వెళ్లి.. తనను పెళ్లి చేసుకోవాలంటూ పదే పదే బతిమిలాడాడు. హీరోయిన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ యువకుడు ఇలా చేశాడు. భోజ్‌పురి హీరోయిన్‌కు ఈ పరిస్థితి ఎదురైంది. వారణాశిలోని ఓ స్టార్ హోటల్లో ఈ ఘటన జరిగింది. పంకజ్ యాదవ్ అనే యువకుడు హోటల్ గదిలోకి ప్రవేశించాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరాడు. అయితే, అందుకు ఆమె తిరస్కరించింది. గట్టిగా కేకలు వేసింది. హీరోయిన్ కేకలు విన్న ఓ వ్యక్తి ఆ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఆ వచ్చిన యువకుడి మీద పంకజ్ యాదవ్ కాల్పులు జరిపాడు. ప్రాణభయంతో ఆ యువకుడు బయటకు పరుగులు తీశాడు.

హోటల్ గదిలో కాల్పుల శబ్దం విన్న వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే అక్కడకు వచ్చారు. అయితే, మరోసారి గన్ తీసిన పంకజ్ యాదవ్ ఈసారి హీరోయిన్‌ను చంపేస్తానని, లేకపోతే తనను తాను కాల్చుకుంటానని బెదిరించాడు. పోలీసులు అతడికి నచ్చజెప్పి.. అతడి చేత గన్‌ను పక్కన పెట్టించే క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ మీద కూడా కాల్పులు జరిపాడు. అయితే, ఆ పోలీస్ తృటిలో తప్పించుకున్నాడు. చివరకు పోలీసులు మరో మార్గం ద్వారా హోటల్ రూమ్‌లోకి ప్రవేశించి అతడిని పట్టుకున్నారు. అయితే, హీరోయిన్‌ను వేధించడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ముంబైలో కూడా ఇలాగే చేశాడట. అప్పుడు పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినా మారలేదు. ఇప్పుడు వారణాశిలో కూడా హోటల్ గదిలో నానా హంగామా సృష్టించాడు.
First published: May 26, 2019, 10:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading