చిత్తూరులో విషాదం.. కోడలి ఆత్మహత్య.. అవమాన భారం తట్టుకోలేక మామ బలవన్మరణం

చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారి పల్లెలోని ఓ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోడలు అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే మామ బలవన్మరణానికి పాల్పడ్డాడు.


Updated: October 24, 2020, 11:26 AM IST
చిత్తూరులో విషాదం.. కోడలి ఆత్మహత్య.. అవమాన భారం తట్టుకోలేక మామ బలవన్మరణం
ఫ్రతీకాత్మక చిత్రం
  • Share this:
చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం బోడిరెడ్డిగారి పల్లెలోని ఓ ఇంట్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోడలు అంత్యక్రియలు ముగిసిన కొద్దిసేపటికే మామ బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బోడిరెడ్డిగారిపల్లెకు చెందిన రామిరెడ్డి-పూర్ణమ్మల కుమారుడు ఆనంద్‌రెడ్డి బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి నాలుగు నెలల క్రితం అదే గ్రామానికి చెందిన హరిత తో వివాహం జరిగింది. హరిత అరగొండ అపోలో హాస్పిటల్‌లో నర్సింగ్ లెక్చరర్‌గా పనిచేస్తోంది. అయితే గత పెళ్లైనా కొద్ది రోజుల నుంచే ఆనంద్‌ తన భార్యను వేధిస్తున్నట్టుగా తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఆనంద్‌రెడ్డి భార్యతో కలిసి ఇంట్లోనే ఉంటున్నాడు.

హరిత రోజు ఆస్పత్రిలో విధులకు హాజరయి వస్తోంది. ఈ క్రమంలోనే భర్త వేధింపులు ఎక్కువవడం, తరుచూ అనుమానపడుతుండటంతో ఆమె నెల రోజుల క్రితం ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటివద్దే ఉంటుంది. బుధవారం భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆనంద్ హరితపై చేయి చేసుకున్నాడు. దీంతో భర్త వేధింపులు తాళలేక హరిత గురువారం ఇంట్లోనే ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో హరిత అదే రోజు పోస్టుమార్టమ్ జరిపి.. రాత్రి సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. అయితే అప్పటికే హరిత మూడు నెలల గర్భిణి. హరిత మృతికి భర్త, అత్తమామల వేధింపులే కారణమని ఆమె తల్లి పద్మావతమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున పొలం వద్దకు వెళ్లిన రామిరెడ్డి.. ఎంతసేపటికి ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా.. చెట్టుకు ఊరేసుకుని వేలాడుతూ కనిపించాడు. కోడలి మరణంతో అవమాన భారం తట్టుకోలే రామిరెడ్డి ఆత్మహత్య బలవనర్మణం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. పోస్ట్ మార్టమ్ అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యలకు అప్పగించారు. అయితే భార్య ఆత్మహత్య అనంతరం ఆనంద్‌రెడ్డి కనిపించకుండా పోవడంతో.. మరో కుమారుడు రామిరెడ్డి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించాడు.
Published by: Sumanth Kanukula
First published: October 24, 2020, 11:26 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading