విశాఖలో విషాదం.. అన్న కొడుకు చనిపోయిన కాసేపటికే బాబాయ్ ఆత్మహత్య

ఆస్పత్రిలో అతడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు. కాసేపటికే నేరుగా ఆస్పత్రికి భవనం టెర్రర్‌ మీదకు వెళ్లి.. అక్కడి నుంచి దూకి చనిపోయాడు.

news18-telugu
Updated: February 28, 2020, 6:59 PM IST
విశాఖలో విషాదం.. అన్న కొడుకు చనిపోయిన కాసేపటికే బాబాయ్ ఆత్మహత్య
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అతడికి పిల్లలు లేరు. భార్య కూడా దూరంగా ఉంటుంది. అందుకే తన అన్న కొడుకునే కన్న కొడుకుగా చూసుకునేవాడు. ఒకరకంగా చెప్పాలంటే అన్న కొడుకే అతడికి సర్వస్వం..! ఐతే అనారోగ్యంతో ఆ బాలుడు చనిపోవడంతో ఆ బాబాయ్ తట్టుకోలేకపోయాడు. ఆస్పత్రిలో అతడి మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించాడు. కాసేపటికే నేరుగా ఆస్పత్రికి భవనం టెర్రర్‌ మీదకు వెళ్లి.. అక్కడి నుంచి దూకి చనిపోయాడు. విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలంలో ఈ విషాద ఘటన జరిగింది.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. చిప్పాడ గ్రామానికి చెందిన ఈశ్వరరావు కుమారుడు భానుప్రకాశ్‌ (12) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం విశాఖపట్టణంలోని రాంనగర్‌లో ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ఐతే పరిస్థితి విషమించి శుక్రవారం ఉదయం భాను ప్రకాశ్ చనిపోయాడు. ఆ వార్త విని తల్లిదండ్రులతో పాటు ఆ బాలుడి బాబాయ్ చిరంజీవి కన్నీరుమున్నీరుగా విలపించారు. భాను మరణవార్తను తట్టుకోలేక.. అదే ఆస్పత్రి భవనం మీది నుంచి దూకి చిరంజీవి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇరువరి మృతితో ఈశ్వరరావు కుటుంబం శోకసంద్రంలో మునిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

First published: February 28, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు