హోమ్ /వార్తలు /క్రైమ్ /

తనతో కలిసి డాన్స్ చేయడం లేదని భార్యకు ట్రిపుల్ తలాక్.. నిప్పంటించుకున్న భర్త

తనతో కలిసి డాన్స్ చేయడం లేదని భార్యకు ట్రిపుల్ తలాక్.. నిప్పంటించుకున్న భర్త

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తాళి కట్టిన భార్య తాను చెప్పిన పనులు చేయడం లేదనే కోపంతో ఆ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. అదే కారణంతో కలత చెందిన ఆ భర్త.. చివరికి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు.

 • News18
 • Last Updated :

  భార్యను పాటలు పాడాలని కోరాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. పోని డాన్స్ చేయమన్నాడు. ఆమె కుదరదని చెప్పింది. అవి రెండు కాకపోతే.. జీన్స్ వేసుకుని తనతో బయటకు షికారుకు వెళ్లాలన్నాడు. దానికీ ఆమె ససేమిరా అంది. దీంతో భార్య తాను చెప్పిన పనులు చేయడం లేదనే కోపంతో ఆ భర్త ఆమెకు విడాకులిచ్చాడు. అదే కారణంతో కలత చెందిన ఆ భర్త.. చివరికి ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తున్నది. ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు కింది విధంగా ఉన్నాయి.

  వివరాల్లోకెళ్తే.. మీరట్ లోని న్యూఇస్లామియానగర్ కు చెందిన అమీరుద్దీన్ ఎనిమిదేండ్ల క్రితం తన కూతురును హపూర్ వాస్తవ్యుడైన అనాస్ కు ఇచ్చి పెళ్లి చేశాడు. పెళ్లైనప్పటి నుంచి వీరి మధ్య సంబంధాలు గొప్పగా ఏం లేవు. ఇద్దరూ తరుచూ గొడవ పడుతూ ఉండేవారు. అనాస్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తాడు. అనాస్ ప్రతిసారి తన భార్యను.. పాటలు పాడాలని, డాన్స్ చేయాలని అడిగేవాడు. కానీ దానికి ఆమె తిరస్కరించేది. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య చాలాసార్లు విబేధాలు వచ్చాయి. పలుమార్లు ఇరు కుటుంబాల మధ్య పంచాయతీ కూడా అయింది.

  ఇదిలాఉండగానే.. కొద్దిరోజుల నుంచి అనాస్ అదే తీరుగా వ్యవహరిస్తున్నాడు. తన భార్యను డాన్స్ చేయాలని.. జీన్స్ వేసుకుని తనతో పాటు స్టెప్స్ వేయాలని పదే పదే కోరేవాడు. కానీ ఆమె మాత్రం దానికి అస్సలు అంగీకరించకపోయేది. దీంతో ఆగ్రహించిన అనాస్.. భార్యకు ట్రిపుల్ తలాఖ్ చెప్పాడు. దాంతో ఆమె రెండ్రోజుల క్రితమే వారి పుట్టింటికి వెళ్లింది. భార్య వెళ్లిన తర్వాత.. అనాస్ తన బంధువుల ఇంటికెళ్లి అక్కడ పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన వారి కుటుంబసభ్యులు.. మంటలు ఆర్పి వెంటనే ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Crime, Crime news, Up news, Uttarpradesh

  ఉత్తమ కథలు