Home /News /crime /

MAN DIES OF SUICIDE NOTE CLAIMS WIFE COULDNT WEAR SAREE PROPERLY INTERESTING CRIME STORY FROM MAHARASHTRA SK

నా భార్య సరిగా చీర కట్టుకోవడం లేదు... అందుకే చనిపోతున్నా.. పెళ్లైన 6నెలలకే భర్త ఆత్మహత్య

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తన భార్య సరిగా చీర కట్టుకోవడం లేదని ఆ సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. అంతేకాదు ఆమెకు సరిగా నడవడం మాట్లాడడం రాదని పేర్కొన్నాడు. ఆమెతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఉంది.

    తల్లి తిట్టిందని ఒకరు... భార్త కొట్టాడని మరొకరు.. ప్రేమ విఫలమైందని ఇంకొకరు.. ఇలాంటి కారణాలతో ఈ మధ్య చాలా మంది చనిపోతుతున్నారు. టీవీలు, పేపర్లతో ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తున్నాయి. చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఏదైనా సమస్య ఎదురైతే.. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి. తెగించి కొట్లాడాలి. అంతేతప్ప ఆత్మహత్య చేసుకోవడం సరికాదు. కానీ ఈ మధ్య.. ఏ చిన్న సమస్య వచ్చినా.. వాటిని కొందరు ఎదుర్కోలేకపోతున్నారు. దాని గురించే నిత్యం ఆలోచిస్తూ డిప్రెషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. మరికొందరైతే క్షణికావేశంలో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి ఘటనే ఒకటి వెలుగుచూసింది. తన భార్య సరిగా చీర కట్టుకోవడం లేదన్న కారణంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

    OMG: ఇంట్లో ఖాళీ ప్లాస్టిక్ డ్రమ్ము.. కాంక్రీట్‌తో కప్పేసి ఉంది.. తెరిచి చేస్తే ఘోరం..

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఔరంగాబాద్‌లోని ముకుంద్ నగర్‌కు చెందిన 24 ఏళ్ల సామధాన్ సాబ్లేకు ఆరు నెలల క్రితమే వివాహం జరిగింది. తన కంటే ఆరేళ్లు పెద్ద వయసున్న మహిళలను పెళ్లి చేసుకున్నాడు. భార్యాభర్తలిద్దరు అన్యోన్యంగానే ఉంటున్నారు. కానీ కొన్ని రోజులుగా ఇరువరి మధ్య గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ క్రమంలోనే సోమవారం సామధాన్ సాబ్లే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ వారికి ఓ సూసైడ్ నోట్ లభించింది. అందులో షాకింగ్ విషయాలు ఉన్నాయి. ఆ వివరాలను చూసి పోలీసులు ఖంగుతిన్నారు.

    crime: మాజీ ప్రియుడితో వెళ్లిపోయిన వివాహిత..భరించలేకే భర్త ఆ పని చేశాడంట

    తన భార్య సరిగా చీర కట్టుకోవడం లేదని ఆ సూసైడ్ నోట్‌లో రాసి ఉంది. అంతేకాదు ఆమెకు సరిగా నడవడం మాట్లాడడం రాదని పేర్కొన్నాడు. ఆమెతో కలిసి జీవించడం తనకు ఇష్టం లేదని.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా ఉంది. ఆ సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భార్యపై మనస్థాపంతోనే సామధాన్ సాబ్లే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ముకుంద్‌వాడి పోలీస్ స్టేషన్ ఇంచార్జి బ్రహ్మగిరి తెలిపారు. ఈరు నెలల క్రితమే వీరి వివాహం జరిగిందని.. ఘటనపై దర్యాప్తు జరుగుతుందని చెప్పారు. ఇరుగుపొరుగు వారితో పాటు బంధువులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఘటనా స్థలంలో లభించిన సూసైడ్ నోట్, చుట్టుపక్కల చెప్పిన వివరాల ఆధారంగా.. అతడు ఆత్మహత్యచేసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. తదుపరి విచారణ కొనసాగుతుందని వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Maharashtra

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు