హోమ్ /వార్తలు /క్రైమ్ /

Hair transplant :హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వికటించి వ్యక్తి మృతి!

Hair transplant :హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వికటించి వ్యక్తి మృతి!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అతడి మృతితో ఆ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఇద్దరు నిపుణులతోపాటు, మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

Hair transplant :హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ వికటించి వ్యక్తి మృతి! దేశ రాజధానిలో విషాద ఘటన చోటుచేసుకుంది. హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్‌(Hair transplant)వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడు. అతడి మృతితో ఆ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఇద్దరు నిపుణులతోపాటు, మరో ఇద్దరిని అరెస్టు చేశారు.

అసలేం జరిగిందంటే

దేశరాజధాని ఢిల్లీలో(Delhi)నివసించే అథర్ రషీద్(30)కి టీవీ ఎగ్జిక్యూటివ్‌ గా పనిచేస్తున్నాడు. రషీద్ కి బట్టతల ఉంది. దీంతో అతడు ఢిల్లీలోని ఒక క్లినిక్‌లో ఇటీవల హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేయించుకున్నాడు. ఇందుకు సరైన శిక్షణ, నైపుణ్యం లేని సర్జన్ల క్లినిక్‌లో రూ.15 వేల ఫీజు చెల్లించినట్టు సమాచారం. అయితే ట్రీట్‌మెంట్ పూర్తైన కొన్ని రోజుల తర్వాత నుంచి రషీద్ కి అనారోగ్య సమస్యలు ఎదురయ్యాయి. రషీద్ శరీరమంతా దద్దుర్లు మొదలయ్యాయి. తర్వాత కిడ్నీ సంబంధిత సమస్యలు ప్రారంభమయ్యాయి. శరీరంలో చాలా ఆర్గాన్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ క్రమంలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ రషీద్ మరణించాడు. రషీద్‌కు తల్లి, ఇద్దరు చెల్లెలు ఉన్నారు. రషీద్ చనిపోవడంతో ఆ కుటుంబానికి దిక్కు లేకుండా పోయింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే రషీద్ ప్రాణాలు పోయాయని,హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఓ మోసమని రషీద్ తల్లి ఆసియా బేగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. "నేను నా కొడుకును కోల్పోయాను. కొంతమంది వ్యక్తుల ఇలాంటి మోసపూరిత పద్ధతుల కారణంగా ఏ తల్లీ తన బిడ్డను కోల్పోకూడదు’ అని ఆమె మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. రషీద్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసిన ఇద్దరు నిపుణులతోపాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

400 ఏళ్ల నాటి ప్రత్యేక ఆలయం... కుష్టువ్యాధి కూడా నయం అవుతుందని ప్రతీతి.. ఆలయం ఎక్కడుందో తెలుసా.. ?

ఈ ఘటనపై అసోసియేషన్‌ ఆఫ్‌ హెయిర్‌ రీస్టోరేషన్‌ సర్జన్స్‌ ఆఫ్‌ ఇండియా కార్యదర్శి మయాంక్‌ సింగ్‌ మాట్లాడుతూ.. కౌబాయ్‌ క్లినిక్‌ల వలన హెయిర్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఇండస్ట్రీకి చెడ్డపేరు వస్తుందని అన్నారు. కాగా,హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ ప్రక్రియ వికటించి ప్రాణాలు కోల్పోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఇలానే కొంతమంది ప్రాణాలు కోల్పోయారు. అందుకే ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు. 2019లో ముంబైకు చెందిన ఒక వ్యాపారవేత్త... 2021 సెప్టెంబర్ గుజరాత్‌కు చెందిన ఒక వ్యక్తి హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ వల్లే మృతి చెందారు.

First published:

Tags: Crime news, Delhi

ఉత్తమ కథలు