పండుగ రోజు విషాదం.. రోడ్డు ప్రమాదంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దుర్మరణం.. భార్యకు ఎనిమిదో నెల

ప్రతీకాత్మక చిత్రం

స‌తీష్‌ కు ఏడాదిన్నర క్రితమే జక్రాన్‌పల్లికి చెందిన యువతితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. మ‌రో నెల రోజుల్లో త‌నకు పుట్టే బిడ్డ‌ను చూసేవాడు.

 • Share this:
  తానొక‌టి త‌లిస్తే... దోవుడు మ‌రోటి త‌ల‌చిన‌ట్టుగా ఉంది. మ‌రో గంట‌లో ఇంటికి చేరుకునే లోపు రోడ్డు ప్రమాదం త‌న ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. సంక్రాతి పండ‌గ కుటుంబ‌స‌భ్యుల‌తో చేసుకునేందుకు బ‌య‌లుదేరి కుటుంబాన్ని చేర‌క‌ముందే త‌నువు చాలించారు. ఈ ఘ‌ట‌న నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌ మండలం సుర్భిర్యాల్‌కు చెందిన బొల్లవత్రి సతీష్‌ (34) సాఫ్ట్ వేర్ ఉద్యోగి. కారోనా మ‌హమ్మ‌రి కార‌ణంగా ఇంట్లోనే ఉంటూ విధులు నిర్వహిస్తున్నారు.. గ‌త నెల రోజులుగా హైదరాబాద్ లో ఉంటున్నాడు. అయితే మంగళవారం రాత్రి విధులు ముగించుకొని ద్విచక్ర వాహనంపై పండుగకు సొంతూరుకు బయలుదేరాడు. మ‌రో గంట‌లో ఇంట‌కి చేరుకుంటాడు... అయితే సదాశివనగర్‌ మండలం అడ్లూర్‌ ఎల్లారెడ్డి శివారులోని 44వ జాతీయ రహదారిపై డివైడర్‌ను ఢీకొట్టి అక్కడికక్కడే మృతి చెందాడు. హైద‌రాబాద్ నుంచి త‌న సొంతూరికి సుమారు 170 కిలోమీట‌ర్ల దూరం. అయితే సుమారు 110 కిలో మీట‌ర్ల ప్రయాణం బాగానే సాగింది. కానీ మ‌రో 60కిలో మీట‌ర్ల దూరం ప్రయాణం చేస్తే త‌న వారిని క‌లిసేవాడు. కానీ త‌న‌కు మృత్యువు డివైడ‌ర్ రూపంలో వ‌చ్చింది. ముందునుంచి వ‌స్తున్న వాహన లైటింగ్ తో రోడ్డు క‌నిపించక ప్ర‌మాదం జ‌రిగిందా? లేక నిద్ర‌మ‌త్తులో ప్ర‌మాదం జ‌రిగిదా? అతి వేగంతో ప్రమాదం జ‌రిగిందా అనేది తెలియాలి.

  స‌తీష్‌ కు ఏడాదిన్నర క్రితమే జక్రాన్‌పల్లికి చెందిన యువతితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె ఎనిమిది నెలల గర్భిణి. మ‌రో నెల రోజుల్లో త‌నకు పుట్టే బిడ్డ‌ను చూసేవాడు.. కానీ విధి అడిన వింత నాట‌కంలో పుట్టే బిడ్డ‌కు తండ్రిని లేకుండా చేసాడని కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు. ఈ ఘ‌ట‌న అందరినీ క‌లిచివేసింది.

  పండుగ వేళ ఏపీలో దారుణం.. పట్టపగలు మహిళపై అత్యాచారం

  ఆంధ్రప్రదేశ్ లో పండుగ వేళ దారుణం జరిగింది. ఒంటరిగా వెళ్తున్న మహిళపై కన్నేసిన యువకులు ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టారు. రాత్రివేళ లిఫ్ట్ ఇస్తామని బాధితురాలిని నమ్మించిన ఆ దుర్మార్గులు ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి ఘాతుకానికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణాజిల్లాలో గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది.గన్నవరం మండలం, తెంపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ.., వేరే ప్రాంతంలో నివాసముంటోంది. సంక్రాంతి పండుగ కోసం స్వగ్రామానికి వస్తోంది. గన్నవరం నుంచి తెంపల్లి వెళ్లే మార్గంలో బస్సు సర్వీసులు లేకపోవడం, ఆటోలు కూడా దొరక్కపోవడంతో అటువైపుగా వస్తున్న ఇద్దరు యువకులు ఆమెకు లిఫ్ట్ ఇస్తామన్నారు. దీంతో ఆమె కూడా వారి బైక్ ఎక్కింది. ఐతే ఆమెను గ్రామానికి తీసుకెళ్లకుండా రూటు మార్చిన యువకులు..,ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. పట్టపగలే ఈ దారుణం జరిగినా ఎవరూ గుర్తించలేకపోయారు.
  Published by:Ashok Kumar Bonepalli
  First published: