Home /News /crime /

MAN DIES BY SUICIDE IN DELHI PVR CINEMA S WASHROOM PAH

Shocking: బ్లేడ్ తో కోసుకుని.. పీవీఆర్ సినిమా హల్ లో వ్యక్తి సూసైడ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: వ్యక్తి పీవీఆర్ సినిమా వాష్ రూమ్ లో విగత జీవిగా కన్పించాడు. పదునైన బ్లేడ్ తో కోసుకుని సూసైడ్ చేసుకున్న షాకింగ్ ఘటన వెలుగులోనికి వచ్చింది.

కొందరు చిన్న పాటి విషయాలకు కంట్రోల్ తప్పి ప్రవర్తిస్తుంటారు. చిన్న విషయాలకే పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు. నూరెళ్ల జీవితానికి మధ్యలోనే ముగింపు పలుకుతారు. ఎగ్జామ్ లో పాస్ కాలేదని, ప్రియురాలు లవ్ కి ఒప్పుకోలేదని, ఇంట్లో వారు ఫోన్ కొనివ్వలేదని, కొత్త బట్టలు వద్దన్నారని, ఉద్యోగం రాలేదని సూసైడ్ లు చేసుకుంటారు. రైలు కింద పడి, బిల్డింగ్ మీద నుంచి దూకి, ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకుని, విషం తాగి, కత్తులతో గాయం చేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. ఇలాంటి ఎన్నో వార్తలు మనం తరచుగా చూస్తుంటాం. తాజాగా, ఈ కోవకు చెందిన మరో సూసైడ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

పూర్తి వివరాలు.. ఢిల్లీలో  (Delhi) షాకింగ్ ఉదంతం వెలుగులోనికి వచ్చింది. వికాస్పురిలోని పీవీఆర్ సినిమా వద్ద శుక్రవారం ఓ వ్యక్తి ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. సదరు వ్యక్తి వాష్ రూమ్ లో విగత జీవిగా ఉండటాన్ని కొంత మంది గమనించారు. వెంటనే సినిమా సిబ్బందికి సమాచారం ఇచ్చారు.



దీంతో పోలీసులు రంగంలోకిదిగి విచారణ చేపట్టారు. అతని జేబులో చూడగా కొన్ని ఐడేంటీటీ కార్డులు లభించాయి. సూసైడ్ కు గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు. పదునైన బ్లేడ్ తో మెడ కోసుకున్నట్లు సమాచారం. వెంటనే బాడీని పోస్ట్ మార్టంకు తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగ ఒక మహిళ మరో వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది.

కర్ణాటక చెందిన రమేష్ అనే 30సంవత్సరాల యువకుడు తన భార్యతో కలిసి వికారాబాద్ పట్టణంలో వాచ్‌మెన్‌గా పనిచేసేవారు. ఇద్దరికి ఎనిమిది సంవ‌త్స‌రాల క్రితం వివాహం అయింది. ముగ్గురు పిల్ల‌ల‌లో క‌లిసి ఎల్లారెడ్డిలో నివాసముంటున్నారు. ఆ సమయంలో వికారాబాద్ టౌన్‌కి చెందిన దస్తప్పాతో రమేష్‌ భార్య వెన్నెల వివాహేతర సంబంధం పెట్టుకుంది. ప్రియుడు దస్తప్పతో తరచూ శారీరకంగా కలుస్తూ ఉండేది. ఈవిషయంలోనే భర్త ఆమెతో గొడవపడేవాడు. అయినప్పటికి భార్య ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తన కుటుంబాన్ని కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి పట్టణానికి మార్చాడు.

శారీరక సుఖం కోసమే..

ఎల్లారెడ్డి పట్టణంలోని నూతనంగా నిర్మిస్తున్న భవనములో వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. తన భార్య వేరే వ్యక్తితో శారీరక సంబంధం పెట్టుకుందనే కారణంతోనే రమేష్ ఫ్యామిలీని వికారాబాద్ నుంచి ఎల్లారెడ్డికి మార్చినప్పటికి ఆమెలో మార్పు రాలేదు. ఎల్లారెడ్డికి చేరుకున్నప్పటికి ప్రియుడు దస్తప్పను ఇంటికి పిలిపించుకొని పలుమార్లు శరీరక సంబంధాన్ని కొనసాగించింది. ఈ విషయం భర్త రమేష్‌కు తెలియడంతో మరోసారి భార్యను హెచ్చరించాడు.ప్రియుడితో తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుపడుతున్నాడని..అతడ్ని చంపేస్తే తాను ప్రియుడితో సుఖంగా ఉండవచ్చనే ఆలోచన చేసింది రమేష్‌ భార్య.
Published by:Paresh Inamdar
First published:

Tags: Cinema, Crime news, Delhi, Suicide

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు