ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ పందెం.. కామారెడ్డి జిల్లాలో ఘటన

స్నేహితుల మధ్య సరదా పందెం.. ఓ నిండు ప్రాణాలను బలిగొంది.  నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మధ్యం అలాగే సేవించాలని కాసిన పందెలో ఒక వ్యక్తి మృతి చెందాడు.

news18-telugu
Updated: October 24, 2020, 7:15 AM IST
ప్రాణం తీసిన ఫుల్ బాటిల్ పందెం.. కామారెడ్డి జిల్లాలో ఘటన
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
స్నేహితుల మధ్య సరదా పందెం.. ఓ నిండు ప్రాణాలను బలిగొంది.  నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ మధ్యం అలాగే సేవించాలని కాసిన పందెలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో చోటుచేసుకుంది. పట్ణణంలోని శాంతినగర్‌కు చెందిన సోమేశ్వరం సాయిలు(40) శివారులో ఉన్న పంట పొలానికి వెళ్లాడు. ఐదుగురు స్నేహితులు రావడంతో పార్టీ చేసుకోవాలని అనుకున్నాడు. ఇందుకోసం మద్యం కొనుగోలు చేసి తీసుకొచ్చాడు. పొలం సమీపంలోనే వారంతా మద్యం సేవించడం మొదలుపెట్టారు. అయితే మద్యం తాగుతుండగా సాయిలు, మరో వ్యక్తికి మధ్య వాదన మొదలైంది. ఇది కాస్తా బెట్టింగ్‌కు దారితీసింది.

నీళ్లు కలపకుండా ఫుల్ బాటిల్ సేవించాలని వారిద్దరు పందెం పెట్టుకున్నారు. పోటీలో భాగంగా ఇద్దరు ఫుల్ బాటిల్ సేవించి అక్కడే పడిపోయారు. దీంతో మిగతా స్నేహితులు ఇద్దరిని ఎవరి ఇంట్లో వారిని దించేశారు. కొంతసేపటికి సాయిలు నోటీ నుంచి నురుగ రావడం మొదలైంది. దీంతో కుటుంబసభ్యులు అతడిని బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సాయిలు మృతిచెందాడు.

ఈ ఘటనతో మృతుడి భార్యతోపాటు, అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మందు పందెంతో ఓ వ్యక్తి చనిపోవడంతో బాన్సువాడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సాయిలు భార్య గంగామణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ మహేష్ గౌడ్ తెలిపారు.
Published by: Sumanth Kanukula
First published: October 24, 2020, 7:15 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading