హోమ్ /వార్తలు /క్రైమ్ /

Andhra Pradesh: అమ్మను రైలెక్కించింది.. నాన్న కోసం ఫోన్ చేసింది.. కానీ ఇంతలోనే..

Andhra Pradesh: అమ్మను రైలెక్కించింది.. నాన్న కోసం ఫోన్ చేసింది.. కానీ ఇంతలోనే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువతి తల్లిదండ్రులను రైలు ఎక్కించడానికి.. వారిని తీసుకుని రైల్వే స్టేషన్‌కు వచ్చింది. తల్లిని రైలులో కూర్చొబెట్టింది. తండ్రి కోసం ఫోన్ చేయడం మొదలుపెట్టింది.

ఓ యువతి తల్లిదండ్రులను రైలు ఎక్కించడానికి.. వారిని తీసుకుని రైల్వే స్టేషన్‌కు వచ్చింది. తల్లిని రైలులో కూర్చొబెట్టింది. రైలు కదిలే కూడా సమయం కూడా దగ్గరపడింది. తండ్రి ఇంకా రాక పోవడంతో ఆమెలో కంగారు మొదలైంది. తండ్రికి ఫోన్ చేయసాగింది. అయితే ఫోన్ రింగ్ అవుతున్న ఎవరూ లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆమెలో టెన్షన్‌ మరింతగా పెరిగింది. ఈలోపే అక్కడికి సమీపంలో జనం పెద్ద ఎత్తున గుమికూడటం చూసిన యువతి.. రైలు ఢీకొట్టి ఎవరో మృతిచెందినట్టు తెలుసుకుంది. దీంతో అక్కడ చేరుకున్న యువతి.. ఒక్కసారిగా షాక్ తింది. మృతిచెందింది తన తండ్రేనని గుర్తుపట్టి.. గుండెలు పగిలేలా రోదించింది. యువతి రోదించిన తీరు అక్కడున్నవారిని కూడా కంటతడి పెట్టించింది. ఈ విషాద ఘటన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లాలోని వేదాయపాలెం రైల్వే స్టేషన్‌లో ఇటీవల చోటుచేసుకుంది.

రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు.. వెంకటగిరి పట్టణానికి చెందిన కామిశెట్టి విద్యాసాగర్‌(56) తెలుగుగంగ ప్రాజెక్టు పొదలకూరు సబ్‌ డివిజన్‌ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీరుగా పని చేస్తున్నారు. ఆయనకు భార్య సుధారాణి, నవ్య, సాయికుమార్‌ పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆయన వేదాయపాలెం ఆర్‌ఆర్ టవర్స్‌లో కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇక, కొద్ది రోజులుగా విద్యాసాగర్ కంటి సమస్యతో బాధపడుతున్నాడు. ఇందుకు సంబంధించి చైన్నెలోని ఓ ఆస్పత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు.

ఈ క్రమంలోనే చికిత్స‌లో భాగంగా భార్యతో కలిసి చెన్నై వెళ్లేందుకు గురువారం ట్రైన్ టికెట్లు బుక్ చేసుకున్నాడు. దీంతో విద్యాసాగర్ కూతురు నవ్య.. తల్లిదండ్రులను ఒకరి తర్వాత ఒకరిని తన స్కూటీపై రైల్వే స్టేషన్‌కు తీసుకువచ్చింది. అనంతరం ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై నుంచి రెండో నెంబర్ ప్లాటఫామ్‌పైకి తీసుకెళ్లింది. తల్లిని రైలులో కూర్చొబెట్టింది. అయితే ట్రైన్ కదిలే సమయం దగ్గర పడుతున్న తండ్రి రాకపోవడంతో.. ఫోన్ చేసింది. అయితే ఫోన్ రింగ్ అవుతున్న ఎవరూ లిఫ్ట్ చేయలేదు.

ఈ క్రమంలోనే రైలు ఢీకొట్టి ఎవరో మృతిచెందారని తెలుసుకున్న నవ్య.. అక్కడి చేరుకుంది. ఆ చనిపోయింది తన తండ్రే అని తెలుసుకుని బోరున విలపించింది. ఇక, రైలు వెళ్లిపోతుందన్న తొందరలో ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై కాకుండా పట్టాలు దాటి రెండో నెంబర్‌ ప్లాట్‌పామ్‌కు చేరుకుందామని అనుకన్న విద్యాసాగర్‌ను.. గూడురు వైపు నుంచి వచ్చిన గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఇక, విద్యాసాగర్ మృతదేహాన్ని రైల్వే పోలీసులు.. పోస్ట్‌మార్టమ్ నిమిత్తం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

First published:

Tags: Andhra Pradesh, Nellore, Train accident

ఉత్తమ కథలు