Mirchi Bajji: కత్తే కాదు బజ్జీ కూడా ప్రాణం తీస్తుంది.. వ్యక్తి ప్రాణం తీసిన మిరపకాయ బజ్జీ

వ్యక్తి ప్రాణం తీసిన బజ్జీ

Mirchi Bajji killed a man: కత్తితో కాదు కంటి చూపుతో చంపేస్తా అంటూ బాలయ్య ఓ సినిమాలో చెప్పిన డైలాగ్ అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. కంటిచూపు సంగతేమో కానీ.. ఓ వేడి వేడి మిర్చీ బజ్జీ ఓ వ్యక్తి ప్రాణాన్ని బలికొంది.

  • Share this:
    Man Died After Eating Mirchi Bajji: మిర్చి బజ్జీ మనిషి ప్రాణం తీయడమేంటి నమ్మశక్యంగా లేకపోవచ్చు కానీ ఇది నిజం.. మిర్చి బజ్జీ (Mirchi Bajji)లను ఇష్టంగా తినే ఓ వ్యక్తి ఎప్పటిలాగే వేడి వేడి బజ్జీ తినాలని రోడ్డుపై ఉండే హోటల్ కు వచ్చాడు. వేడి వేడి బజ్జీ పార్శిల్ ఇవ్వమని ఆర్డర్ చేశాడు.. ఇంటికి వెళ్లిన తరువాత డాబాపై ప్రశాంతంగా ఆ బజ్జీ రుచిని ఆస్వాదించాలి అనుకున్నాడు. కానీ తనకు ఎంతో ఇష్టమైన ఆ బజ్జీ తన ప్రాణం తీస్తుందని అతడు ఊహించలేకపోయాడు. అలా బజ్జీ తింటూ ఉండగానే అతడిని ఆ బజ్జీ రూపంలో మృత్యువు బలితీసుకుంది. గొంతులో బజ్జీ ఇరుక్కుని ఊపిరి ఆడకపోవడంతో 40 ఏళ్ల వ్యక్తి మరణించాడు. ఈ సంఘటన తెలంగాణ (Telangana) లోని మహబూబ్ నగర్ జిల్లాలో (Mahaboob Nagar district) బుధవారం చోటుచేసుకుంది. జిల్లాలోని మిడ్జిల్ మండలం వేముల గ్రామానికి చెందిన మల్లేశ్ (Mallesh) కొంతకాలంగా హైదరాబాద్‌లో నివాసముంటున్నాడు. అయితే వ్యక్తిగత పనుల కోసం మల్లేశ్.. సొంత గ్రామమైన వేములకు మంగళవారం రాత్రి వచ్చాడు. రాత్రి వేళ ఇంటి డాబాపై కూర్చోని హోటల్ నుంచి తెచ్చుకున్న మిర్చి తింటున్నాడు. కానీ ఊహించిన విషాదం చొటు చేసుకుంది.

    తనకు ఎంతో ఇష్టమైన బజ్జీలు చేతిలో ఉన్నాయి. పైగా డాబాపై వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఒంటరిగా ఉన్న అతడు బజ్జీల రుచిని ఆస్వాదించడానికి ఇంతకన్నా సరైన సమయం ఏదీ లేదనుకున్నాడు.. అంతే ఆ రుచిని ఆస్వాదిస్తూ ఈ లోకాన్ని మైమరచిపోయేలా బజ్జీలు తినడం ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో ఓ మిర్చి బజ్జీ ముక్క గొంతుకు అడ్డుపడింది. దీంతో హెల్ప్ అని అరవడానికి కూడా అతడికి నోరు రాలేదు. తీవ్ర ఇబ్బంది పడుతూ.. అక్కడే మృతి చెందాడు.

    ఇదీ చదవండివ్యాయామం చేయకుండానే.. బెల్లీఫ్యాట్ కరిగించొచ్చు.. ఈ 5 విషయాలు తెలుసుకుంటే ఎంతో ప్రయోజనం

    అయితే రాత్రి కావడంతో మల్లేశ్ ఇంటిపైనే నిద్రపోయాడని కుటుంబసభ్యులు అనుకున్నారు. బుధవారం ఉదయం డాబాపైనుంచి మల్లేశ్ రాకపోవడంతో.. కుటుంబసభ్యులు డాబాపైకి వెళ్లి చూశారు. అప్పటికే మల్లేశ్ మృతి చెందిఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. బజ్జీ గొంతుకు అడ్డుపడటంతోనే మల్లేశ్ మృతి చెందినట్లు పేర్కొంటున్నారు.



    కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే నిజంగానే బజ్జీ గొంతులో అడ్డుపడి చనిపోయాడా.. లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా.. హత్య లేక ఆత్మహత్య అయ్యి ఉండొచ్చా.. అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే నిజంగా గొంతులో అడ్డుపడితే కిందకు వచ్చి మంచినీళ్లు తాగాలి కదా.. ఎందుకు అలానే అక్కడ ఉండిపోయాడు అని పోలీసులు అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది.
    Published by:Nagesh Paina
    First published: