పందెం కోసం మందుకొట్టి.. 42 గుడ్లు తినేసరికి...

50 గుడ్లు తిని, ఫుల్ బాటిల్ మద్యం తాగాలనేది పందెం. గెలిచిన వారికి రూ.2000 ఇస్తామని పందెం కాశారు.

news18-telugu
Updated: November 4, 2019, 10:58 PM IST
పందెం కోసం మందుకొట్టి.. 42 గుడ్లు తినేసరికి...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఓ యువకుడు పందెం కోసం ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. 50 గుడ్లు తినాలని పందెం కట్టారు. అయితే, 42వ గుడ్డు తినేసరికి గుడ్లు తేలేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలో ఈ ఘటన జరిగింది. సుభాష్ యాదవ్ అనే వ్యక్తి తన స్నేహితులతో పందెం కట్టాడు. 50 గుడ్లు తిని, ఫుల్ బాటిల్ మద్యం తాగాలనేది ఆ పందెం ఉద్దేశం. గుడ్లు మొత్తం తినేసి... ఫుల్ బాటిల్ మందు తాగితే.. గెలిచిన వారికి రూ.2000 ఇస్తామని పందెం కాశారు. ఆ పందేన్ని స్వీకరించిన సుభాష్ యాదవ్ ఓ వైపు మందు కొడుతూ.. మరోవైపు గుడ్లు తినడం ప్రారంభించాడు. అలా.. 41 గుడ్లు తిన్నాడు. 42వ గుడ్డు తినేసరికి గుడ్లు తేలేశాడు. అపస్మారక స్థితికి చేరిపోయాడు. దీంతో స్నేహితులు అతడిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే, అతడు చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు.

జగన్ డబ్బులిస్తారంటూ భవన నిర్మాణ కార్మికుల వద్ద వసూళ్ల దందాFirst published: November 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు