Home /News /crime /

MAN DIED AFTER ATTACK BY FRIEND OVER ILLICIT RELATIONSHIP WITH HIS WIFE MS

స్నేహితుడని నమ్మితే.. భార్యతో ఆ సంబంధం.. చివరకు విషాదం..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మంగళవారం సాయంత్రం సునీల్ అక్కడికి రాగానే వాచ్‌మెన్ విషయం చెప్పాడు. దాంతో సునీల్‌ను ఇంటి టెర్రస్‌పై ఉన్న పెంట్ హౌజ్‌లోకి మాట్లాడుదామని తీసుకెళ్లి దాడి చేశారు.అతన్ని గదిలో బంధించి విచక్షణారహితంగా చావబాదారు.

    వివాహేతర సంబంధం ఓ ప్రాణాన్ని బలిగొంది. మహిళ తరుపు బంధువులు, ఆమె భర్త కలిసి అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు.తీవ్ర గాయాలపాలై కొనఊపరితో కొట్టుమిట్టాడుతున్న అతన్ని పోలీసులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

    వివరాల్లోకి వెళ్తే..తూర్పుగోదావరి జిల్లా నర్సాపూర్‌కు చెందిన సూర్యనారాయణ, సునీల్ ఇద్దరు మంచి స్నేహితులు.హైదరాబాద్‌లోని గాజులరామారంలో
    వీరు వేర్వేరు అపార్ట్‌మెంట్స్‌లో నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో తరుచూ ఒకరి ఇంటికి ఒకరు వచ్చి వెళ్తుంటారు. అయితే ఇదే అదనుగా సునీల్ సూర్యనారాయణ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. విషయం తెలిసిన సూర్యనారాయణ సునీల్ గురించి బావమరుదలతో చర్చించాడు.అంతా కలిసి అతనిపై దాడి చేయాలని నిర్ణయించారు. అతను అపార్ట్‌మెంట్‌కు వచ్చినప్పుడు సమాచారం అందించాలని వాచ్‌మెన్‌తో చెప్పారు.

    మంగళవారం సాయంత్రం సునీల్ అక్కడికి రాగానే వాచ్‌మెన్ విషయం చెప్పాడు. దాంతో సునీల్‌ను ఇంటి టెర్రస్‌పై ఉన్న పెంట్ హౌజ్‌లోకి మాట్లాడుదామని తీసుకెళ్లి దాడి చేశారు.అతన్ని గదిలో బంధించి విచక్షణారహితంగా చావబాదారు. సునీల్ తీవ్ర గాయాలతో తల్లడిల్లుతుండటంతో.. చనిపోతాడేమోనని భయపడి పోలీసులకు సమాచారం అందించారు.పోలీసులు సునీల్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినప్పటికీ.. బుధవారం ఉదయం అతను మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ రమణారెడ్డి తెలిపారు.
    First published:

    Tags: Affair, Illegal affairs, Illicit relationship

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు