చనిపోయాడనుకున్న వ్యక్తి 3 నెలల తర్వాత మళ్లీ తిరిగొచ్చాడు..

బీహార్‌లోని నిసార్‌పురాకు చెందిన కృష్ణ మాంఝీ అనే వ్యక్తి అగస్టులో అదృశ్యం అయ్యాడు. అదే నెల 10న బీహార్‌లోని హమత్పూర్ గ్రామంలో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారన్న నెపంతో ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసి హత్య చేశారు.

news18-telugu
Updated: November 17, 2019, 9:44 PM IST
చనిపోయాడనుకున్న వ్యక్తి 3 నెలల తర్వాత మళ్లీ తిరిగొచ్చాడు..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
చనిపోయాడనుకున్న వ్యక్తి.. మళ్లీ తిరిగొస్తే ఎలా ఉంటుంది. ఒకేసారి షాక్.. సంతోషం.. రెండూ కలుగుతాయి. బీహార్‌లోని నిసార్‌పురా గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది. నిసార్‌పురాకు చెందిన కృష్ణ మాంఝీ అనే వ్యక్తి అగస్టులో అదృశ్యం అయ్యాడు. అదే నెల 10న బీహార్‌లోని హమత్పూర్ గ్రామంలో చిన్నపిల్లల్ని ఎత్తుకెళ్తున్నారన్న నెపంతో ఓ వ్యక్తిపై గ్రామస్తులు దాడి చేసి హత్య చేశారు. అయితే మృతదేహం గుర్తుపట్టకుండా ఉండటంతో.. అతన్ని గుర్తించడం కష్టంగా మారింది. పోలీసులు మాత్రం అతను కృష్ణ మాంఝీ అని భావించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుటుంబ సభ్యులు అతను కృష్ణ మాంఝీయే అనుకుని అంత్యక్రియలు కూడా నిర్వహించారు.

ఇదంతా జరిగిన దాదాపు 3 నెలల తర్వాత ఇటీవల కృష్ణ మాంఝీ హఠాత్తుగా ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు షాక్‌కి గురయ్యారు.ఆరోజు మృతదేహాన్ని సరిగా గుర్తించకపోవడంతో తప్పిదం జరిగినట్టు తెలిపారు. పోలీసులు ఆ మృతదేహం కృష్ణ మాంఝీదే అని చెప్పడంతో.. తాము కూడా అదే నమ్మామని తెలిపారు. ఎట్టకేలకు కృష్ణ మాంఝీ ఇంటికి తిరిగిరావడం తమకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...