Home /News /crime /

MAN DECLARED DEAD 24 YEARS AGO RETURNS TO VILLAGE IN UTTARAKHAND VB GH

Viral News: చనిపోయిన 24 ఏళ్లకు బతికి వచ్చిన వ్యక్తి.. ఎలా సాధ్యమైంది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

సాధారణంగా సినిమాలు, టీవీ సీరియళ్లలో హీరో లేదా హీరోయిన్ చనిపోవడం.. ఆ తర్వాత ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని లేదా అలాగే కొన్ని నెలలు లేదా సంవత్సరాలకి తిరిగి రావడం మనం చూస్తూనే ఉంటాం. కానీ నిజంగానే చనిపోయాడనుకున్న వ్యక్తి అలా తిరిగి రావడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంటుంది. అలాంటి ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ లో జరిగింది. వివరాలిలా..

ఇంకా చదవండి ...
సాధారణంగా సినిమాలు, టీవీ సీరియళ్లలో హీరో లేదా హీరోయిన్ చనిపోవడం.. ఆ తర్వాత ముఖం ప్లాస్టిక్ సర్జరీ చేసుకొని లేదా అలాగే కొన్ని నెలలు లేదా సంవత్సరాలకి తిరిగి రావడం మనం చూస్తూనే ఉంటాం. కానీ నిజంగానే చనిపోయాడనుకున్న వ్యక్తి అలా తిరిగి రావడం చాలా తక్కువ సందర్భాల్లోనే జరుగుతుంటుంది. అలాంటి ఘటనే తాజాగా ఉత్తరాఖండ్ లో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లా రాణీఖేత్ ప్రాంతానికి చెందిన మధో సింగ్ అనే వ్యక్తి 24 సంవత్సరాల క్రితమే కనిపించకుండా పోయాడు. చాలా కాలం పాటు వేచి చూసిన తర్వాత అతడు చనిపోయాడని కుటుంబ సభ్యులు నిర్ధారించారు. 24 సంవత్సరాల క్రితం ఇంట్లో జరిగిన ఓ చిన్న గొడవ వల్ల అతడు ఇళ్లు విడిచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత పదేళ్ల పాటు ఆ కుటుంబ సభ్యులు మధో సింగ్ కోసం వేచి చూశారు. ఆ తర్వాత ఇక మరణించాడేమో అనుకొని అతడి అంతిమ క్రియలు నిర్వహించి ఏటా పిండ ప్రదానం కూడా చేస్తున్నారు. అయితే గత వారం అనూహ్యంగా మధోసింగ్ ఆ ఊర్లో ప్రత్యక్షమయ్యాడు.

శనివారం ఆ వ్యక్తిని ఊరి చివర ఉన్న పొలాల్లో చాలా బలహీనమైన స్థితిలో గ్రామస్తులు గుర్తించారు. అతడు అక్కడికి ఎలా వచ్చాడు.. అతడిని ఎవరు తీసుకొచ్చారు అనే వివరాలు మాత్రం అతడు ఎవరికీ చెప్పలేదు. చాలా బలహీనంగా ఉన్న మధో సింగ్‌ను గ్రామస్తులు మోసుకుంటూ అతడి ఇంటి వద్దకు చేర్చారు. ఆ తర్వాత పండితుడిని కలిసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఇన్నేళ్లుగా పిండ ప్రదానం చేస్తున్నందున తిరిగి నామకరణం చేసిన తర్వాతే అతడిని ఇంట్లోకి రానివ్వడం మంచిదని చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు ఇంటి ముందే ఓ టెంట్ వేసి 72 ఏళ్ల మధో సింగ్‌ను అక్కడే ఉంచేశారు. పండితుడి ఆధ్వర్యంలో నామకరణం చేసిన తర్వాతే అతడిని ఇంట్లోకి అనుమతిస్తామని కూడా వారు వెల్లడిస్తున్నారు.

ఇన్ని సంవత్సరాల నుంచి మధో భార్య వితంతువుగా జీవితాన్ని కొనసాగించింది. కొడుకు, కూతురు వివాహాలను చేసింది. ప్రస్తుతం అతడి కుమారుడు దిల్లీలో పనిచేస్తున్నాడు. దీని గురించి మధో బంధువు 38 సంవత్సరాల రామ్ సింగ్ మెహ్రా మాట్లాడుతూ.. ‘తావూ (బాబాయి) ఇంటి నుంచి వెళ్లిపోయినప్పుడు చాలా చిన్నవాడిని. కుటుంబ సభ్యులు ఆయన కోసం చాలా వెతికారు. ఆయన తిరిగి వస్తాడేమో అని పది సంవత్సరాల పాటు వేచి చూశారు. అయినా రాకపోవడంతో మా కుల దేవత దగ్గర ఉన్న పండితుడిని అడిగి.. మరణించాడని నిర్ధారించారు. అప్పటి నుంచి పిండ ప్రదానం చేస్తున్నారు’ అంటూ వెల్లడించారు.
Published by:Veera Babu
First published:

Tags: Crime news, Dead body, Uttarapradessh

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు