• Home
  • »
  • News
  • »
  • crime
  • »
  • MAN DEAD 3 YEARS AGO GETS COVID VACCINE IN GUJARAT NOT A LONE CASE MK GH

Covid vaccines: 3 ఏళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి కోవిడ్ వ్యాక్సిన్. పక్కదోవ పడుతున్న కోవిడ్ టీకాలు

ప్రతీకాత్మకచిత్రం

గుజరాత్‌లో తాజాగా మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు, కుటుంబ సభ్యుల ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో దీనిపై దర్యాప్తు చేయాలని అతడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆ రాష్ట్రంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి.

  • Share this:
దేశ వ్యాప్తంగా 18 ఏళ్లు నిండిన వారికి మే1 నుంచే వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. కానీ టీకాల కొరత కారణంగా చాలా రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ మందకోడిగా జరుగుతోంది. ఇదే సమయంలో కొన్ని రాష్ట్రాల్లో అధికారులు కోవిడ్ వ్యాక్సిన్లను పక్కదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గుజరాత్‌లో తాజాగా మూడేళ్ల క్రితం చనిపోయిన వ్యక్తికి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లు, కుటుంబ సభ్యుల ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో దీనిపై దర్యాప్తు చేయాలని అతడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఆ రాష్ట్రంలో గతంలోనూ ఇలాంటి ఘటనలు వెలుగు చూశాయి.

గుజరాత్‌లోని ఉప్లెటా ప్రాంతానికి చెందిన హరదాస్‌భాయ్ కరింగియా అనే వ్యక్తి 2018లో చనిపోయారు. అతడి కుటుంబ సభ్యులు ప్రభుత్వ అధికారుల నుంచి డెత్ సర్టిఫికెట్‌ను కూడా తీసుకున్నారు. కానీ మూడేళ్ల తరువాత, మే 3న అతడికి కోవిడ్-19 టీకాలు వేసినట్లు కుటుంబ సభ్యుల ఫోన్‌కు మెస్సేజ్ వచ్చింది. దీంతో పాటు టీకా తీసుకున్న తరువాత ఇచ్చే సర్టిఫికేట్‌ కూడా హరదాస్ భాయ్ పేరుతో వచ్చింది. దీంతో ఆశ్చర్యపోవడం వారి వంతు అయింది.

ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని కోరుతున్నారు హరదాస్‌ భాయ్‌ మేనల్లుడు అరవింద్ కరింగియా. ‘హరదాస్‌భాయ్ కరింగియా మే 3న మొదటి డోసు కోవిడ్-19 వ్యాక్సిన్‌ తీసుకున్నట్లు ఫోన్‌కు ఎస్‌ఎంఎస్ వచ్చింది. కానీ ఆయన మూడేళ్ల క్రితమే చనిపోయారు. ప్రభుత్వం ఇచ్చిన డెత్ సర్టిఫికెట్ కూడా మా దగ్గర ఉంది. అసలు ఏం జరుగుతోందో మాకు అర్థం కావట్లేదు’ అని చెబుతున్నాడు అరవింద్. దేశవ్యాప్తంగా రాష్ట్రాలు తీవ్రమైన వ్యాక్సిన్ కొరతను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ విషయం వెలుగులోకి రావడం గమనార్హం. అయితే గుజరాత్‌లో ఇలాంటి ఘటనలు ఇంతకు ముందు కూడా చోటుచేసుకున్నాయి. చనిపోయిన వారు వ్యాక్సిన్ తీసుకున్నట్లు, వారి కుటంబ సభ్యులకు మెస్సేజ్‌లు వచ్చాయనే వార్తలు వినిపిపంచాయి. దీంతో వ్యాక్సిన్ల సరఫరాపై అనుమానాలు తలెత్తుతున్నాయి.

రాష్ట్రంలోని దాహోద్‌లో ఇలాంటి మరో కేసు నమోదైంది. నరేశ్ దేశాయ్ అనే వ్యక్తికి ఇటీవల కోవిన్ పోర్టల్ నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది. అతడి తండ్రి నట్వర్‌లాల్ దేశాయ్ కోవిడ్-19 టీకా తీసుకున్నట్లు దాంట్లో పేర్కొన్నారు. కానీ నట్వర్‌లాల్‌ దేశాయ్ 2011లోనే కన్నుమూశారు. దాహోద్ లోని లిమ్డి ప్రాంతంలో మరో కేసు నమోదైంది. ఈ ఏప్రిల్‌లో చనిపోయిన 72 ఏళ్ల మధుబెన్ శర్మ అనే మహిళ, మే నెలలో రెండో డోసు వ్యాక్సిన్ తీసుకున్నట్లు ఎస్‌ఎంఎస్‌ వచ్చింది. మార్చి 2న మధుబెన్ మొదటి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే నాన్- కోవిడ్ సమస్యలతో ఆమె ఏప్రిల్ 15న మరణించారు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, సంబంధిత టీకా కేంద్రంలో నిరసన చేపట్లారు. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. మొత్తానికి జిల్లా ఆరోగ్య అధికారి ఈ ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.

చనిపోయిన వారి పేరుతో వ్యాక్సిన్ ఎస్‌ఎమ్‌ఎస్‌లు వస్తున్న ఘటనలపై ఇప్పటివరకు గుజరాత్‌లో పదికి పైగా కేసులు నమోదయ్యాయి. అయితే కొందరు అధికారులే చనిపోయిన వారి పేరుతో వ్యాక్సిన్లను అమ్ముకుంటున్నారా? లేదా సాంకేతిక తప్పిదాల వల్ల ఇలా జరుగుతుందా అనే వివరాలు మాత్రం ఇంకా తెలియలేదు. పూర్తి స్థాయి దర్యాప్తు తరువాతే ఈ కేసులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Published by:Krishna Adithya
First published: