MAN CUTS HIS THROAT TO GET CHANCE IN MOVIES BY LISTENING TO HIS BROTHER IN TAMILNADU NR
Movie chance: గదిలోకి వెళ్లి అలా చేస్తే అవకాశం వస్తుందని తమ్ముడు చెప్పడంతో.. నీచమైన?
casting call
Movie chance: చాలామందికి ఏదో ఒక విషయంలో ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇక వాటి గురించి సాధించడానికి ఎంతటి దానినైనా కాదనకుండా ముందుకు వెళ్తారు. ఇక సినిమాలలో నటించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది
Movie chance: చాలామందికి ఏదో ఒక విషయంలో ఇష్టాయిష్టాలు ఉంటాయి. ఇక వాటి గురించి సాధించడానికి ఎంతటి దానినైనా కాదనకుండా ముందుకు వెళ్తారు. ఇక సినిమాలలో నటించాలని చాలా మందికి ఆసక్తి ఉంటుంది. ఇక కొందరు తమ వల్ల కాదని వదిలేస్తుంటే.. మరికొంతమంది ఎలాగైనా సినిమాల్లో అవకాశాలు దక్కించుకోవాలని నటనకు కావాల్సిన సాహసాలు చేస్తుంటారు. ఇదిలా ఉంటే తాజాగా సినిమా విషయం గురించి తమ్ముడు ఇచ్చిన చెత్త సలహాతో గదిలోకి వెళ్ళిన అన్న అందరినీ షాక్ అయ్యేలా చేశాడు.
తమిళనాడు కాంచీపురం జిల్లా సుంగువాసత్రం సంతవేలూరు కు చెందిన అన్న తమ్ముళ్లు. ఇందులో మారిముత్తు అనే ప్రైవేట్ ఉద్యోగి. ఈయనకు తన తమ్ముడి ని చూసి సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువయింది. ఇక సినిమాల్లో నటించడానికి ఏం చేయాలంటూ తన తమ్ముడిని అడిగాడు. ఇక తన తమ్ముడు సినిమాల కోసం చాలా కాలం నుండి చెన్నై లో ఉంటున్నాడు. ఇక తన అన్న అడిగిన ప్రశ్నకు ఓ చెత్త సమాధానం చెప్పాడు.
ప్రాణం పోకుండా గొంతు కోసుకుని వీడియో చేస్తే సినిమాలో ఛాన్స్ వచ్చే అవకాశం ఉందని తన అన్నకు తెలిపాడు. దీంతో అతడు శుక్రవారం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక నటనపై ఆసక్తితో గదిలోకి వెళ్లి తన తమ్ముడు చెప్పినట్టు చేసుకోవడానికి ప్రయత్నించాడు. గది తలుపులు మూసుకొని గొంతు కోసుకున్నాడు. దీంతో తెల్లవారి అయ్యేసరికి అతను తలుపు తీయకపోగా.. చుట్టుపక్కన ఉన్న వాళ్లు పోలీసులకు సమాచారాన్ని తెలిపారు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు బద్దలు కొట్టి అతడిని ఆస్పత్రిలో చేర్చారు.
ఇక అతడికి గాయం పెద్దగా కాకపోగా మొత్తానికి ప్రాణాలతో బయటపడ్డాడు. దీంతో ఆయనని ఇలా ఎందుకు చేసావ్ అని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని తెలిపాడు. ఇక అతనిపై, తన తమ్ముడి పై పలు కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు.
Published by:Navya Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.