విశాఖలో దారుణం, నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన యువకుడు

విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువతి గొంతును కత్తితో కోసి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు.

news18-telugu
Updated: October 31, 2020, 11:13 PM IST
విశాఖలో దారుణం, నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన యువకుడు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖలో దారుణ సంఘటన చోటు చేసుకుంది. నడిరోడ్డుపై యువతి గొంతును కత్తితో కోసి ఓ యువకుడు దారుణానికి ఒడిగట్టాడు. గాజువాక సుందరయ్య కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది. వరలక్ష్మి అనే విద్యార్థిని సుందరయ్య కాలనీ సాయిబాబా గుడి వద్ద అఖిల్ అనే యువకుడు అడ్డగించి గొంతుకోశాడు. తీవ్ర రక్త స్రావం కావడంతో ఆమె మృతి చెందింది. దాడికి పాల్పడ్డ యువకుడి అఖిల్ గా గుర్తించారు. అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణం వెనుక ప్రేమ వ్యవహారమే కారణం అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి మృతదేహాన్ని కేజీహెచ్ కు తరలించారు.

ఇటీవల విజయవాడలో యువతిని చంపిన ప్రేమోన్మాది

ఈ నెలలోనే విజయవాడలో దారుణం జరిగింది. ప్రమోన్మాది ఘాతుకానికి ఓ యువతి బలైపోయింది. ప్రేమ పేరుతో వేధించిన యువకుడు.. ఆమె నిరాకరించడంతో కక్ష పెంచుకున్నాడు. దీంతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు. అనంతరం తాను కూడా చనిపోవాలని ప్రయత్నించాడు. ఈ దాడిలో యువతి మృతి చెందగా.. ప్రేమోన్మాది గాయపడ్డాడు. విజయవాడ నగరంలోని క్రీస్తురాజపురానికి చెందిన దివ్య తేజస్విని అనే యువతి ఇంజినీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన స్వామి అనే యువకుడు స్థానికంగా పెయింటర్‌గా పని చేస్తున్నాడు. తేజస్వినిని కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు స్వామి. ఈక్రమంలో ఆమెను వేధించసాగాడు. అయితే.. స్వామి ప్రేమను తేజస్విని తిరస్కరించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. తేజస్విని తన ప్రేమను నిరాకరించడంతో ఉన్మాదిగా మారిపోయాడు. ఆమెను హతమార్చాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో యువతి ఇంటికి వెళ్లాడు. ఈనేపథ్యంలో మళ్లీ వారిద్దరి మధ్య ఘర్షణ జరిగింది.

ఆవేశంతో స్వామి తన వెంట తెచ్చుకున్న కత్తితో దివ్య తేజస్వినిపై తీవ్రంగా దాడి చేశాడు. ఆమె మెడపై కత్తితో గాయం కావడంతో తీవ్ర గాయాలపాలైంది. వెంటనే ఆమెను స్థానికంగా ఉన్న ఈఎస్‌ఐ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరు జీజీహెచ్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ తేజస్విని మృతి చెందింది. తేజస్వినిపై దాడి చేసిన అనంతరం స్వామి కూడా అదే కత్తితో తనను తాను గాయపర్చుకున్నాడు. స్వామిని కూడా గుంటూరు జీజీహెచ్ కే తరలించారు. ప్రస్తుతం అతను అక్కడ చికిత్స పొందుతున్నాడు. అయితే, తమ ఇద్దరికీ పెళ్లయిపోయిందని అతడు చెప్పాడు. కానీ, అదంతా అవాస్తవం అని పోలీసులు విచారణలో తేల్చారు. ఉద్దేశపూర్వకంగా చంపాలనే టార్గెట్ చేసుకుని వచ్చాడని నిర్ధారించారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 31, 2020, 11:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading