Dubbaka: దుబ్బాకలో దారుణం, ఇద్దరు కుమార్తెల గొంతు కోసిన తండ్రి

ప్రతీకాత్మక చిత్రం

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు.

  • Share this:
    సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. కన్నతండ్రే తన ఇద్దరు కుమార్తెల గొంతు కోశాడు. గమనించిన స్థానికులు... బాలికలను హుటాహుటిన సిద్దిపేట్ ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. బాలికల పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని నిందితుడు మహ్మద్​ను అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్​ కుటుంబం 15 రోజుల క్రితం జోవనోపాధి కోసం నాందేడ్ నుంచి మిరుదొడ్డి మండలం మోతెకు వచ్చింది.

    పోలీసుల సమయస్ఫూర్తితో నిలబడిన ప్రాణాలు

    ఈరోజు ఉదయం 10:15 గంటల సమయంలొ చిట్టాపూర్ గ్రామం నుండి సంతోష్ అనే వ్యక్తి భూంపల్లి పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేశాడు. మహ్మద్ తన ఇద్దరు కూతుర్లు అంజాయన్ (8), అలీనా (6)ను చంపే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం ఇచ్చాడు. వెంటనే భూంపల్లి ఎస్ఐ సర్దార్ జమీల్, కానిస్టేబుళ్లు బాల్ రాజ్, రాజిరెడ్డి, ఏఆర్ కానిస్టేబుల్ రమేష్ పెట్రోల్ కార్ లో చిట్టాపూర్ వెళ్లారు. అతని ఇంటికి వెళ్లి ఆడపిల్లలను ఏమీ చేయవద్దని విజ్ఞప్తి చేశారు. కానీ, మహ్మద్ అప్పటికే ఇంట్లోకి ఎవరు రాకుండా ఇంటికి గడియ పెట్టుకుని ఎంత చెప్పినా వినకుండా, ఇద్దరు పిల్లలను కాళ్ళ మధ్యలో పెట్టుకొని కత్తితో చంపేస్తానని బెదిరించాడు., వెంటనే పిల్లల ప్రాణాలు కాపాడాలని దృఢ సంకల్పంతో కానిస్టేబుళ్లు బాల్ రాజ్, రమేష్ డోరు పగలగొట్టి, ఇంటి పై కప్పు రేకులు తీసివేసి ఇంటి లోకి వెళ్లారు. ఆ సమయంలో కత్తితో అలీనా గొంతు కోసి ఉండగా, మరో పాప గొంతు కోయడానికి ప్రయత్నిస్తున్నాడు. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలో బాల్ రాజ్, రమేష్ లకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే 108 అంబులెన్సులో ఇద్దరు అమ్మాయిలను ఎస్ఐ సీఐ వెంబడి ఉండి, సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొని వెళ్లి అడ్మిట్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వారి ప్రాణాలకు ఎలాంటి హానీ లేదని డాక్టర్లు ధ్రువీకరించారు. స్వల్ప గాయాలైన బాల్ రాజ్, రమేష్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నందున ఇద్దరు ఆడపిల్లల ప్రాణాలు కాపాడినందుకు గ్రామస్తులు గ్రామ పెద్దలు పోలీసులు చేసిన సాహసాన్ని అభినందించారు.

    మహ్మద్‌కు ఇద్దరు భార్యలు. మొదటి భార్య జమిరీద్ బీ. రెండవ భార్య మేరజ్. మొదటి భార్యకు ముగ్గురు పిల్లలు ఫయాజ్, అంజాయన్, అలీనా. రెండవ భార్యకు ఒక కొడుకు. రెండో భార్య, ఆమె కొడుకు మహారాష్ట్ర వెళ్లారు. మొదటి భార్య ముగ్గురు పిల్లలు కలిసి మూడు రోజుల క్రితం మోతే గ్రామం నుంచి చిట్టాపూర్ గ్రామానికి వచ్చి రేకుల ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. గత మూడు రోజుల నుంచి మహ్మద్ మద్యం సేవిస్తూ ఇంట్లో భార్యతో గొడవ పడుతున్నాడని పోలీసులు తెలిపారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published: