Home /News /crime /

MAN CREATES FAKE INSTAGRAM ACCOUNT AND THREATENING TO GIRL AT HYDERABAD VB

Fake Account: సోషల్ మీడియాలో యువతికి వేధింపులు.. నన్ను పెళ్లి చేసుకో.. లేదంటే చంపుతా.. రంగంలోకి దిగిన పోలీసులకు షాక్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Fake Account: ఇన్‌స్ట్రాగామ్‌ లో నకిలీ ఐడీ స్పష్టించి యవతిని వేధించాడు. పెళ్లి చేసుకోవాలి.. లేదంటే చంపేస్తానంటూ మెస్సెజ్ లు పెట్టడంతో సదరు యువతి రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

    సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్ లను స్పష్టించి అమ్మాయిలను ట్రాప్ లో పెడుతున్నారు. ఈ మధ్య ఇలాంటి మోసాలు ఎక్కువగా చూస్తున్నాం. కవ్వించి, కైపెక్కించి చివరకు ఉసూరుమనిపిస్తారు. బ్లాక్ మెయిల్ కు పాల్పడి రూ.లక్షల ను వసూలు చేస్తారు. వారి బారిన పడిన వాళ్లు చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇలా ఓ యువకుడు నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ లో ఐడీ స్పష్టించి యువతికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఆమె ఓకే చేయడంతో కొన్ని రోజులు ఇలా మెస్సేజ్ లు చేసుకుంటూ ఉన్నారు. ఓ రోజు తనను పెళ్లి చేసుకో లేకపోతే చంపుతా అంటూ ఆ యువకుడు ఆమెను బెదిరించాడు. ఆమె బెదిరింపులకు బయపడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన రాచకండ సైబరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేకుంది. ఈ ఘటనకు సంబంధించిన రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. యాదాద్రిభువనగిరి జిల్లా రామన్నపేట మండలం, వెల్లంకి గ్రామానికి చెందిన చపాల ప్రవీణ్‌(22) గ్రామంలో మగ్గం వర్క్‌ చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన చేనేత కార్మికుడి ఇంట్లో ఉండే అమ్మమ్మ దగ్గర యువతి నివాసం ఉండేది.

    ప్రవీణ్‌తో యువతికి పరిచయం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త యువకుడు ప్రేమ గా మార్చుకున్నాడు. దీంతో అతను యువతిని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు యువతి వ్యక్తిగత కారణాల వల్ల అతడి ప్రతిపాదనను తిరస్కరించి తన సొంత గ్రామానికి వెళ్లి పోయింది. ఆ రోజు నుంచి అతడు ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఏం చేయాలి అనే ఆలోచనతో ఒక చిత్త ఐడియా అతడికి తట్టింది. నకిలీ ఐడీ ద్వారా ఆమె కు పరిచయం అయి సానుభూతి పొందుదాం అని చేశాడు. ఇన్‌స్ట్రాగామ్‌ ఐడిని సృష్టించి బాధితురాలికి ఫ్రైండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఆమె ఓకే చేసింది. ఈ క్రమంలో తనను వివాహం చేసుకోవాలి.. లేదంటే చంపుతానని యువతిని బెదిరించసాగాడు. దీంతో బాధితురాలు రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి సాంకేతిక ఆధారాలను సేకరించారు.

    నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీ సృష్టించి యువతికి పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతూ మెసేజ్‌లు చేస్తున్న వ్యక్తిని రాచకొండ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి ఒక మొబైల్‌ ఫోన్, 6 సిమ్‌ కార్ట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ప్రవీణ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సందర్భంగా సైబర్‌ క్రైమ్‌ సీఐ బి.ప్రకాష్‌ మాట్లాడుతూ సోషల్‌ మీడియాలో బాలికలు, మహిళలు అపరిచితుల నుంచి ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని సూచించారు.
    Published by:Veera Babu
    First published:

    Tags: Crime news, Cyberabad, Cyberabad police, Fake id, Instagram, Nalgonda, Rachakonda Police

    తదుపరి వార్తలు